Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శాసనసభ్యుడిగా నీటి సమస్యను పరిష్కరించాను : నందమూరి బాలక్రిష్ణ

Advertiesment
Prgya, balayya, Sradha

డీవీ

, శుక్రవారం, 17 జనవరి 2025 (20:32 IST)
Prgya, balayya, Sradha
జనవరి 22న అనంతపూర్ లో ఢాకు మహారాజ్ విజయోత్సవ పండగ జరుపుకోబోతున్నాం. ముందు ముందు వెపన్స్ తో కాదు వాటర్ తోనే యుద్ధం జరుగుతుందని అబ్దుల్ కలామ్ గారు చెప్పారు. ప్రతీదీ ఛాలెంజ్ గా తీసుకుని సినిమాలు చేస్తూ వచ్చాను. నీటి సమస్య అనేది చాలా చోట్ల వుంది. అందుకే నేను ఎం.ఎల్.ఎ.గా వున్నప్పుడే ఈ సమస్యతో సినిమా తీయడం ఆనందంగా వుందని బాలక్రిష్ణ అన్నారు. బాబీ దర్శకత్వంలో ఢాకు మహారాజ్ సినిమా చేశారు. సక్సెస్ లో రన్ అవుతుంది. నాగవంశీ నిర్మాత. ఈరోజు సాయంత్రమే సక్సెస్ మీట్ హైదరబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా సక్సెస్ కేక్ ను కట్ చేశారు. ప్రగ్యా, శ్రద్ధా కు కేక్ ను బాలక్రిష్ణ తినిపించారు.
 
webdunia
Prgya, balayya, Sradha
ఈ సందర్భంగా బాలక్రిష్ణ మాట్లాడుతూ, అఖండ కోవిడ్ టైం లో చేశాం. జనాలు వస్తారోరారో అనుకున్నాం. ఆ తర్వాత ఏం చేయాలి? అందుకే ప్రతిదీ ఛాలెంజ్.. ప్రేక్షకులకు ఏం కావాలనేది ముందుగానే గ్రహించాలి. సినిమా అనేది కన్ జూమర్ ప్రొడక్ట్. భగవంత్ కేసరి చేశాను. మళ్ళీ ఏంచేయాలి? అని ఆలోచిస్తుంటే.. ఢాకు మహారాజ్ వచ్చింది. కథ చిన్నదే. దాన్ని ఏవిధంగా ప్రజలకు తీసుకెళ్ళాలి. నీటికోసం ముందుముందు కొట్టుకు చస్తారు. ఈ పాయింట్ ఎవర్ గ్రీన్ గా అనిపించింది. ఎందుకంటే రాయలసీమ అనే నీటిసమస్య వున్న ప్రాంతం హిందూపూరం లో శాసనసబ్యుడిని. అందుకే బాగా కనెక్ట్ అయింది. నేను ఎం.ఎల్.ఎ.గా వున్నప్పుడు అక్కడ నీటి సమస్యను తీర్చగలిగాను. ఢాకు మహారాజ్ సమస్య రాజస్థాన్ లో వుంది.
 
అందుకే అక్కడ నేపథ్యం తీసుకున్నాను. నన్ను నమ్మి బాబీ చక్కగా తెరకెక్కించాడు. అందరూ బాగా నటించారు. టెక్నీషియన్స్ కూడా బాగా సపోర్ట్ చేశారు. ఇక తమన్ ను ఇకపై ఎన్.బి.కె. తమన్ అని అంటారు అని చెప్పారు.
 
నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ, ప్రతీ డిస్ట్రిబ్యూటర్ హ్యాపీ గా వుండడం పెద్ద సక్సెస్ అన్నారు. 
 దర్శకుడు బాబీ మాట్లాడుతూ, బాలక్రిష్ణ కు లైబ్రరీ ఫిలిం అవ్వాలని అనుకున్నాం, అందరూ మాస్టర్ పీస్ అంటున్నారు. అందుకు గర్వంగా వుంది. నాకు రైటింగ్ అంటే ఇష్టం. 10 ఏళ్ళ పాటు రచయితగా వున్నా. ఆ అనుభవంతో బాలక్రిష్ణ ను బెస్ట్ గా చూడాలని చేశాం. గ్లిజరిన్ లేకుండా ఓ సీన్ లో ఆవేశంతో బెస్ట్ సీన్ చేశారు. షూటింగ్ లో క్లాప్స్ పడ్డాయి బాలయ్య నటనకు అని చెప్పారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పీరియడ్స్‌ నొప్పి అని చెప్పినా నటించమని అనేవారు: నిత్యా మీనన్ షాకింగ్ కామెంట్స్