Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబుల్ ఇస్మార్ట్ డబ్బింగ్ కంప్లీట్ చేసిన సంజయ్ దత్

డీవీ
బుధవారం, 24 జులై 2024 (17:34 IST)
Sanjay Dutt
ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ డబుల్ ఇస్మార్ట్‌లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఫస్ట్ టైం తెలుగులో ఫుల్ లెంత్ రోల్ పోషిస్తున్నారు. సంజయ్ దత్ తన వాయిస్ ని అందించడం ద్వారా అతని క్యారెక్టర్, మూవీకి పవర్ ఇచ్చారు. సంజయ్ దత్ తన పాత్రకు హిందీలో డబ్బింగ్ చెప్పారు.
 
పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి కావస్తుండగా, ప్రమోషనల్ యాక్టివిటీస్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా మాస్ నుంచి వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్‌తో రెండు పాటలు, టీజర్‌ భారీ అంచనాలు నెలకోల్పాయి.
 
ఈ సినిమాలో మాస్, యాక్షన్, డ్రామా, ఎంటర్‌టైన్‌మెంట్‌ డబుల్ డోస్ ఉంటుంది. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన కావ్య థాపర్ హీరోయిన్‌గా నటించింది.
 
ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూర్చారు. సామ్ కె నాయుడు, జియాని గియానెలీ సినిమాటోగ్రఫీ అందించారు.
 
డబుల్ ఇస్మార్ట్ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
 
ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు.
 
నటీనటులు: రామ్ పోతినేని, సంజయ్ దత్, కావ్య థాపర్, అలీ, గెటప్ శ్రీను తదితరులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అరెరె... ఆడబిడ్డలను రక్షించాలని వెళ్తే ద్విచక్ర వాహనం చెరువులోకి ఈడ్చుకెళ్లింది (video)

నా ప్రియుడితో నేను ఏకాంతంగా వున్నప్పుడు నా భర్త చూసాడు, అందుకే షాకిచ్చి చంపేసాం

Jagan: సినిమా చూపిస్తాం.. తప్పు చేసిన వారికి చుక్కలు ఖాయం.. యాప్ రెడీ.. జగన్

వివాహితను కలిసేందుకు అర్థరాత్రి వెళ్లాడు.. గ్రామస్థుల చేతికి చిక్కి తన్నులు తిన్నాడు..

సునామీ ప్రళయం ముంగిట భారత్? నిజమా? ఇన్‌కాయిస్ ఏమంటోంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments