Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెబ్బా పటేల్ 'టమాటో బుగ్గల పిల్ల..' అంటున్న చేతన్ కృష్ణ

డీవీ
బుధవారం, 24 జులై 2024 (17:22 IST)
Hebba Patel, Chetan Krishna
చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "ధూం ధాం". సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. "ధూం ధాం" సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా రూపొందిస్తున్నారు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
 
"ధూం ధాం" సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ సక్సెస్ ఫుల్ గా సాగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన 'మల్లెపూల టాక్సీ..', 'మాయా సుందరి..' పాటలు పాట ఛాట్ బస్టర్స్ అయ్యాయి. ఈ రోజు థర్డ్ సింగిల్ 'టమాటో బుగ్గల పిల్ల..' లిరికల్ సాంగ్ విడుదల చేశారు. ఈ పాటకు సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా..గోపీ సుందర్ బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు. శ్రీకృష్ణ, గీతా మాధురి ఆకట్టుకునేలా పాడారు. 'ఎట్టెట్టగున్నా నువ్వు భల్లేగుంటావే...ఏ మాయో చేసి నన్ను గిల్లేస్తుంటావే..బంగారం గానీ తిన్నావా నువ్వు బబ్లీగా ముద్దొస్తుంటావే..బంగాళాఖాతం చెల్లెల్లా నన్ను అందంతో ముంచెస్తుంటావే..టమాటో బుగ్గల పిల్ల..' అంటూ సాగుతుందీ పాట. కలర్ ఫుల్ డ్యూయెట్ గా 'టమాటో బుగ్గల పిల్ల..' పాటను రూపొందించారు.
 
నటీనటులు - చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్, సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ, శివన్నారాయణ, బెనర్జీ, సాయి శ్రీనివాస్, ప్రవీణ్, నవీన్ నేని, గిరిధర్, భద్రమ్ తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించబోం.. చంద్రబాబు

ఫోటో షూట్‌ల కోసం తీసుకెళ్లి.. అత్యాచారం చేసి హాస్టల్‌లో దింపాడు..

పోలవరం ప్రాజెక్టు వద్ద కొత్త డయాఫ్రమ్ వాల్.. ప్రారంభం ఎప్పుడు?

మరో ఎంపాక్స్ కేసు.. యూఏఈ నుంచి వ్యక్తికి పాజిటివ్

గణేశ నిమజ్జన శోభాయాత్ర చూశాడు.. బైకుపై వస్తుండగా ఇంటర్ విద్యార్థి హత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments