Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ధూం ధాం సినిమా నుంచి మాయా సుందరి.. లిరికల్ సాంగ్ విడుదల

Advertiesment
Dhoom Dham.. maya sundari song  poster

డీవీ

, గురువారం, 20 జూన్ 2024 (12:59 IST)
Dhoom Dham.. maya sundari song poster
చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "ధూం ధాం". సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. "ధూం ధాం" సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా రూపొందిస్తున్నారు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
 
"ధూం ధాం" సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ సక్సెస్ ఫుల్ గా సాగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన 'మల్లెపూల టాక్సీ..' పాట ఛాట్ బస్టర్ అయ్యింది. మంగ్లీ పాడిన ఈ పాట ప్రేక్షకులకు బాగా రీచ్ అయ్యింది. తాజాగా "ధూం ధాం" సినిమా నుంచి సెకండ్ సింగిల్ 'మాయా సుందరి..' విడుదల చేశారు. ఈ పాటకు సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా..గోపీ సుందర్ మంచి బీట్ తో కంపోజ్ చేశారు. అనురాగ్ కులకర్ణి పాడారు. 'మాయా సుందరి..హే మాయా సుందరి..నా మాయా సుందరి..ఎక్కడున్నావో మరి..గుప్పెడు గుండెను నువ్వే పట్టుకుపోయావే, నా రెప్పల నిద్దురనంతా ఎత్తుకుపోయావే..' అంటూ సాగుతుందీ పాట. హీరో పాడుకునే లవ్ సాంగ్ గా 'మాయా సుందరి..' పాటను స్టైలిష్ గా రూపొందించారు.
 
నటీనటులు - చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్, సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ, శివన్నారాయణ, బెనర్జీ, సాయి శ్రీనివాస్, ప్రవీణ్, నవీన్ నేని, గిరిధర్, భద్రమ్ తదితరులు 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రచయిత కార్తీక్ తీడా రాసుకున్న రియల్ స్టోరీగా నాగచైతన్య బిగ్గెస్ట్ చిత్రం తండెల్