Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న "ధూం ధాం" మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

Advertiesment
dhoom dhaam

ఠాగూర్

, బుధవారం, 6 మార్చి 2024 (16:49 IST)
చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "ధూం ధాం". సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. "ధూం ధాం" సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి కిశోర్ మచ్చ రూపొందిస్తున్నారు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉన్న ఈ సినిమా ఈ సమ్మర్ రిలీజ్ కు రెడీ అవుతోంది. 
 
బుధవారం "ధూం ధాం" సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను మూవీ టీమ్ ఆన్ లొకేషన్ లో రిలీజ్ చేశారు. పెళ్లి బారాత్ లో హీరో హీరోయిన్స్ హ్యాపీగా డ్యాన్స్ చేస్తున్న స్టిల్ ను ఫస్ట్ లుక్ పోస్టర్ గా విడుదల చేశారు. కలర్ ఫుల్ గా ఉన్న ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఓ మంచి లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా "ధూం ధాం" సినిమాను రూపొందిస్తున్నట్లు మేకర్స్ చెబుతున్నారు.
 
నటీనటులు - చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్, సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ, శివన్నారాయణ, బెనర్జీ, సాయి శ్రీనివాస్, ప్రవీణ్, నవీన్ నేని, గిరిధర్, భద్రమ్ తదితరులు
 
టెక్నికల్ టీమ్
డైరెక్టర్ - సాయి కిశోర్ మచ్చ
స్టోరీ స్క్రీన్ ప్లే - గోపీ మోహన్
ప్రొడ్యూసర్ - ఎంఎస్ రామ్ కుమార్
డైలాగ్స్ - ప్రవీణ్ వర్మ
మ్యూజిక్ - గోపీ సుందర్
లిరిక్స్ - సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి
సినిమాటోగ్రఫీ - సిద్ధార్థ్ రామస్వామి
కొరియోగ్రఫీ - విజయ్ బిన్ని, భాను
ఫైట్స్ - రియల్ సతీష్
పబ్లిసిటీ డిజైనర్స్ - అనిల్, భాను
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - శివ కుమార్
ఆర్ట్ డైరెక్టర్ - రఘు కులకర్ణి
ఎడిటింగ్ - అమర్ రెడ్డి కుడుముల
పీఆర్ ఓ- జీఎస్ కే మీడియా

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శర్వానంద్ - కృతిశెట్టి జంటగా నటించే కొత్త చిత్రం పేరు "మనమే"