Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమెజాన్‌లో ఆకట్టుకుంటోన్న ‘అలా నిన్ను చేరి’

Advertiesment
ala ninnu cheri
, ఆదివారం, 24 డిశెంబరు 2023 (09:58 IST)
దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ నటించిన "అలా నిన్ను చేరి" థియేటర్స్‌లో అందరినీ ఆకట్టుకుంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ ప్రేమ కథా చిత్రంగా "అలా నిన్ను చేరి" సినిమాని తెరకెక్కించారు. రీసెంట్‌గానే ఈ మూవీ థియేటర్లోకి రావడం, విమర్శకుల ప్రశంసలతో పాటుగా ప్రేక్షకుల మన్ననలు పొందడం అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ఆడియెన్స్ ముందుకు వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో 'అలా నిన్ను చేరి' స్ట్రీమింగ్ అవుతోంది.
 
ఫ్యామిలీ అండ్ యూత్ ఆడియెన్స్ "అలా నిన్ను చేరి" సినిమాను సక్సెస్ చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంది. మారేష్ శివన్ కథ, కథనం, దర్శకత్వంకు అందరూ ఫిదా అయ్యారు. మరీ ముఖ్యంగా మాటలు గుండెల్ని హత్తుకున్నాయి.
 
హుషారు తరువాత మళ్లీ దినేష్ తేజ్‌కు ఆ రేంజ్‌లో సక్సెస్ వచ్చింది. సక్సెస్‌తో పాటుగా నటుడిగా దినేష్ తేజ్‌కు విమర్శకుల ప్రశంసలు అందాయి. పాయల్ రాధాకృష్ణ, హెబ్బా పటేల్ అందాలు, వారి నటన సినిమా విజయంలో కీలక పాత్రలను పోషించాయి.
 
మహబూబ్ బాషా, మహేష్ ఆచంట, చమ్మక్ చంద్ర ఇలా ఎంతో మంది ఆర్టిస్టులు ప్రేక్షకుల్ని నవ్వించారు. ఐ ఆండ్రూ సినిమాటోగ్రఫీ మేజర్ అస్సెట్‌గా నిలిచింది. సుభాష్ ఆనంద్ అందించిన సంగీతం సినిమాకు బలంగా మారింది. రీ రికార్డింగ్ ఈ సినిమాకు ప్లస్‌గా నిలిచింది.
 
విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ ఈ సినిమాను నిర్మించారు. కర్నాటి రాంబాబు ఎగ్జిక్యూటివ్ నిర్మతగా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా సినిమాకు బాధ్యతలు నిర్వర్తించారు. ఇలాంటి అలా నిన్ను చేరి చిత్రాన్ని అమెజాన్‌లో మిస్ అవ్వకుండా చూడండి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సలార్ సినిమా కథను ప్రశాంత్ నీల్ కాపీ కొట్టాడు లేటెస్ట్ అప్ డేట్!