Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

Ram potineni climax fight

డీవీ

, శనివారం, 15 జూన్ 2024 (19:13 IST)
Ram potineni climax fight
యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా ప్రీక్వెల్‌కి డబుల్ ఇస్మార్ట్ సినిమా డబుల్ మ్యాడ్ నెస్ తో ఉండబోతుంది. పూరి జగన్నాధ్ మరోసారి తన హీరోని బెస్ట్  స్టైలిష్, మాస్ యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో ప్రజెంట్ చేశారు.క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ అవుతుందని చిత్ర యూనిట్ చూపుతో స్టిల్ విడుదల చేసింది.
 
ఉస్తాద్ రామ్ పోతినేని, సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తమ మ్యాసీవ్ బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్‌తో తిరిగి వస్తున్నారు. మేకర్స్ ఈరోజు సినిమా విడుదల తేదీకి సంబంధించిన అప్‌డేట్‌ను ఇచ్చారు. డబుల్ ఇస్మార్ట్ ఆగష్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.  
 
సినిమా విడుదలకు  ఇండిపెండెన్స్ డే పెర్ఫెక్ట్ టైమ్. గురువారం సెలవు కాగా, సోమవారం (రక్షాబంధన్) మరో హాలీ డే కూడా సినిమాకు కలిసిరానుంది. పవర్ ఫుల్ రిలీజ్ డేట్ పోస్టర్‌లో రామ్ పవర్-ప్యాక్డ్ అవతార్‌లో విభూతి ధరించి కనిపించారు. బ్యాక్ గ్రౌండ్ లో ఒక శివలింగం, కాగడ ని చూడవచ్చు.
 
ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసిన మేకర్స్ రెగ్యులర్ అప్‌డేట్‌లతో ముందుకు వస్తారు.
 
రామ్ డబుల్ ఇస్మార్ట్‌ని డబుల్ స్కిల్స్ తో అదరగొట్టారు. సంజయ్ దత్ విలన్‌గా కీలక పాత్ర పోషిస్తున్నారు. రామ్ సరసన కావ్య థాపర్ హీరోయిన్.
 
మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రానికి సామ్ కె నాయుడు, జియాని జియానెలి సినిమాటోగ్రాఫర్‌లు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
డబుల్ ఇస్మార్ట్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో విడుదల కానుంది.
 
నటీ నటులు: రామ్ పోతినేని, సంజయ్ దత్, కావ్య థాపర్, అలీ, గెటప్ శ్రీను, తదితరులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రణయగోదారి ఫస్ట్ లుక్ మంచి ఫీల్ కలిగిస్తుంది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి