చిత్రపరిశ్రమలో మిల్కీబ్యూటీగా గుర్తింపు పొందిన తమన్నా భాటియాకు మహారాష్ట్ర సైబర్ సెల్ విభాగం సమన్లు జారీ చేసింది. మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఈ నెల 29వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆమెకు కబురు పంపించారు. మహాదేవ్ అనుబంధ సంస్థ ఫెయిల్ ప్లే యాప్‌ను గతంలో బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటూ ఆ యాప్‌ను ప్రమోట్ చేశారు.
అయితే, గత యేడాది ఐపీఎల్ మ్యాచ్‌లను ఫెయిర్ ప్లే యాప్ చట్ట విరుద్ధంగా స్ట్రీమింగ్ చేసిందంటూ, దీనివల్ల తమకు కోట్లాది రూపాయల మేరకు నష్టం వాటిల్లిందని ఐపీఎల్ ప్రసార హక్కులు పొందిన వయాకామ్ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో విచారణకు హాజరుకావాలని సమన్లలో పేర్కొంది.
కాగా, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‍కు కూడా ఇదే కేసులో ఈ నెల 23వ తేదీన హాజరుకావాలని సైబర్ సెల్ సమన్లు జారీ చేసింది. అయితే, తాను విదేశాల్లో ఉన్నందున ఆ రోజున విచారణకు హాజరుకాలేనని, తన వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు మరో తేదీ, సమయం పంపాలని సంజయ్ దత్ సైబర్ సెల్‌ను కోరిన విషయం తెల్సిందే.