Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గ్లామర్ షోలో తమన్నా భాటియా, రాశి ఖన్నా

Advertiesment
Tamannaah Bhatia  Raashi Khanna

డీవీ

, సోమవారం, 15 ఏప్రియల్ 2024 (06:36 IST)
Tamannaah Bhatia Raashi Khanna
హారర్ కామెడీ సిరీస్ ‘అరణ్మనై’ నుంచి నాల్గవ చిత్రం అరణ్మనై 4, తెలుగులో బాక్ పేరుతో వస్తోంది. సుందర్ సి దర్శకత్వంతో పాటు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, రాశి ఖన్నా హీరోయిన్స్. మేకర్స్ ఇటీవల అన్ని ప్రధాన పాత్రలు ఫస్ట్ లుక్ పోస్టర్‌లను విడుదల ద్వారా ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు. ఈరోజు 'పంచుకో'అనే ప్రోమో సాంగ్ తో వచ్చారు.
 
 హిప్హాప్ తమిళా కొన్ని లైవ్లీ బీట్‌లతో ఫుట్-ట్యాపింగ్ నంబర్‌ను స్కోర్ చేశారు. సాహితీ ఫన్నీ లిరిక్స్ రాస్తే, రాఘవి హస్కీ వాయిస్ మెస్మరైజ్ చేస్తోంది. తమన్నా, రాశీఖన్నాల గ్లామర్‌ ఈ పాటను మరింత అందంగా తీర్చిదిద్దింది. వారి గ్రేస్ ఫుల్ మూమెంట్స్, ముఖ్యంగా హిప్ మూమెంట్స్ చూడటానికి ఒక ట్రీట్‌గా వున్నాయి.  ట్రెండీ అవుట్ ఫిట్స్ ధరించి, హీరోయిన్లిద్దరూ అదరగొట్టారు. ప్రోమో సాంగ్‌లో సినిమాలోని కొన్ని ఎక్సయిటింగ్ సన్నివేశాలను కూడా చూపించారు.
 
అవ్నీ సినిమాక్స్  P Ltd పతాకంపై ఖుష్బు సుందర్, ACS అరుణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, శ్రీనివాసులు, ఢిల్లీ గణేష్, కోవై సరళ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ LLP తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. ఏప్రిల్ 26న 'బాక్ 'ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.
 ఈ చిత్రానికి కృష్ణమూర్తి డీవోపీగా పని చేస్తుండగా, ఎడిటింగ్‌ను ఫెన్నీ ఆలివర్‌ పర్యవేక్షిస్తున్నారు. గురురాజ్ ఆర్ట్ డైరెక్టర్.  
 తారాగణం: సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా, వై వెన్నెల కిషోర్, శ్రీనివాసులు, ఢిల్లీ గణేష్,  కోవై సరళ

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తమిళ న్యూ ఇయర్ సందర్భంగా సూర్య మూవీ 'కంగువ కొత్త పోస్టర్