Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 2 April 2025
webdunia

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

Advertiesment
Ram Pothineni

డీవీ

, బుధవారం, 15 మే 2024 (12:56 IST)
Ram Pothineni
ఉస్తాద్ రామ్ పోతినేని,  పూరీ జగన్నాధ్ తమ మ్యాసీవ్ బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్‌తో అలరించబోతున్నారు. టైటిల్ సూచించినట్లుగా 'డబుల్ ఇస్మార్ట్' చిత్రం ప్రీక్వెల్‌కు రెట్టింపు మ్యాడ్ నెస్ గా  ఉండబోతోంది. డైనమిక్ స్టార్ రామ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేకర్స్ 'డబుల్ ఇస్మార్ట్'  దిమాకికిరికిరి టీజర్ విడుదల చేశారు.
 
హైదరాబాద్‌లోని ఒక ల్యాబ్‌లో ఉన్న హీరో పాత్రను తన చుట్టూ ఉన్న కొంతమంది శాస్త్రవేత్తలతో వివరించే  వాయిస్‌ఓవర్‌తో టీజర్ ప్రారంభమైంది. రామ్ ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్‌గా అదరగొట్టారు. అతను కిరాక్ అమ్మాయిలతో ఫ్లర్ట్ చేస్తాడు, ఖతర్నాక్ బీట్ కోసం అడుగులు వేస్తాడు. కావ్యా థాపర్‌ కథానాయికగా పరిచయమైంది. సంజయ్ దత్ బిగ్ బుల్ గా పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చాడు. క్లైమాక్స్ అద్భుతంగా వుంది.  ఇస్మార్ట్ శంకర్ మాదిరిగానే, డబుల్ ఇస్మార్ట్ కూడా స్పిర్చువల్ టచ్  కూడిన మ్యాసీవ్, యాక్షన్-ప్యాక్డ్ క్లైమాక్స్ సీక్వెన్స్‌ లు ఉండబోతున్నాయి. అద్భుత శివలింగం,  క్లైమాక్స్ ఫైట్ జరిగే భారీ జనసమూహం గూస్‌బంప్‌లను తెప్పించింది.
 
టీజర్ ఖచ్చితంగా డబుల్ ఇంపాక్ట్‌తో ఇస్మార్ట్  మ్యాడ్ నెస్ ని రగిల్చింది. ప్రేక్షకులకు డబుల్ డోస్ యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్, మాస్ ఉల్లాసాన్ని ఆస్వాదించారు. పూరి జగన్నాధ్ మరోసారి తన హీరోని బెస్ట్ స్టైలిష్, మాస్ , యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో ప్రజెంట్ చేశారు. యూనిక్  హైదరాబాదీ యాసలోని వన్-లైనర్లు ఆద్యంతం అలరించాయి. అతని టేకింగ్ చాలా స్టైలిష్‌గా ఉంది. కంటెంట్ డబుల్ యాక్షన్, డబుల్ ఎనర్జీ ,డబుల్ ఫన్‌తో టైటిల్‌కు అనుగుణంగా వుంది. రామ్ డబుల్ ఇస్మార్ట్‌ని రెట్టింపు నైపుణ్యంతో అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. అతని ఎనర్జిటిక్ యాక్టింగ్, ఆన్ స్క్రీన్ చరిష్మా ఎక్స్ ట్రార్డినరీ గా వుంది.
 
సంజయ్ దత్ స్టైలిష్ గెటప్ ఉన్నప్పటికీ డెడ్లీ  విలన్ పాత్రను పోషిస్తున్నారు. కావ్య థాపర్ గ్లామర్‌గా కనిపించింది. అలీని ఫన్నీ రోల్‌లో చూడటం డేజావు ఫీలింగ్ కలిగించింది. పూరీ, అలీ లది హిలేరియస్ కాంబినేషన్.
 
సామ్ కె నాయుడు, జియాని గియాన్నెలీల విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. వారి కలర్స్ ఛాయిస్ ని అభినందించాలి. మణిశర్మ నేపథ్యం మూడ్‌ని ఎలివేట్ చేస్తుంది. స్టెప్పా మార్,  కిరి కిరీ సౌండ్స్ మాస్ హిస్టీరియాను పెంచుతాయి, చివరి భాగంలో శివ సౌండ్ డివోషనల్ టచ్ ఇచ్చింది. పూరి కనెక్ట్స్ ప్రొడక్షన్ డిజైన్ రెట్టింపు గ్రాండ్‌నెస్‌గా ఉంది.
 
 పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్న ఈ చిత్ర దిమాకికిరికిరి టీజర్ సినిమా పట్ల ఉత్సాహాన్ని పెంచింది. డబుల్ ఇస్మార్ట్  తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో విడుదల  కానుంది.
 
ఫస్ట్ ప్రమోషనల్ మెటీరియల్ మన మనసులను కదిలించింది. రామ్ బర్త్ డే కి అభిమానులకు, ఆడియన్స్ కు ఇది సరైన విందు. ఈ ప్రోమోతో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. టీజర్ అత్యంత బ్లాస్ట్ గా ఉండడంతో థియేటర్లలో ఎలాంటి మాస్ హిస్టీరియా కనిపిస్తుందో మనం ఊహించుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?