Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైపర్‌బారిక్ ఆక్సిజన్ థెరపీ తీసుకుంటోన్న సమంత... నేను త్వరలో చనిపోను!

Webdunia
గురువారం, 27 ఏప్రియల్ 2023 (12:10 IST)
Samantha
నటి సమంత మయోసైటిస్‌ నుంచి కోలుకుంటోంది. ప్రస్తుతం ఆమె ట్రీట్మెంట్‌లోనే వుంది. తాజాగా సమంత నటి హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీని తీసుకుంటోంది. ఎందుకంటే ఇది వాపును తగ్గించడానికి, ఇన్ఫెక్షన్లను నయం చేయడానికి, దెబ్బతిన్న కణజాలాలను సరిచేయడానికి సహాయపడుతుంది. 
 
హైపర్‌బారిక్ ఆక్సిజన్ థెరపీ అనేది ఒత్తిడితో కూడిన వాతావరణంలో స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను పీల్చడం. సాధారణ గాలి పీడనం కంటే గాలి పీడనం 2 నుండి 3 రెట్లు పెరుగుతుంది. ఈ పరిస్థితులలో, ఊపిరితిత్తులు సాధారణ గాలి పీడనం వద్ద స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను పీల్చడం కంటే ఎక్కువ ఆక్సిజన్‌ను సేకరించగలవు. 
 
ఈ అదనపు ఆక్సిజన్ బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడుతుంది. ఇది గ్రోత్ ఫ్యాక్టర్స్, స్టెమ్ సెల్స్ అనే పదార్ధాల విడుదలను కూడా ప్రేరేపిస్తుంది. 
 
సమంత దీనిపై స్పందిస్తూ.. "కొన్ని మంచి రోజులు, కొన్ని చెడు రోజులు ఉన్నాయి. కొన్ని రోజులు మంచం నుండి లేవడం చాలా కష్టం. కానీ, కొన్ని రోజులు నేను పోరాడాలనుకుంటున్నాను. అయితే నేను త్వరలో చనిపోను, ప్రాణాహాని లేదు. మయోసైటిస్ నుంచి పోరాడుతున్నాను... అంటూ సమంత తెలిపింది. సమంత చివరిసారిగా తెలుగులో 'శాకుంతలం'లో కనిపించింది. ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ సరసన 'కుషి' చిత్రంలో నటిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments