Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అల్లు అర్హ పాత్రే శాకుంతలంకు హైలైట్.. ప్రశంసల వర్షం

Advertiesment
allu arha
, శనివారం, 15 ఏప్రియల్ 2023 (10:44 IST)
అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకులు సానుకూలంగా స్పందిస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ శకుంతలం కెమెరా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. 
 
ఏప్రిల్ 14 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శకుంతల దుష్యంతుల అమర ప్రేమకథను శాకుంతలం రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
 
ఈ సినిమాలో శకుంతలగా సమంత, దుష్యంతగా దేవ్ మోహన్.. అల్లు అర్హ భరతుడి పాత్రలో కనిపించారు. దీంతో అందరి దృష్టి ఈ చిన్నారిపై పడింది. ఇప్పటికే ప్రీమియర్‌ని చూసిన ప్రేక్షకులు అల్లు అర్హా నటనను మెచ్చుకుంటున్నారు.
 
అయితే తెరపై ఉన్నంత సేపు అల్లు అర్హ ఆకట్టుకుందనే టాక్ వచ్చింది. క్లైమాక్స్‌లో అల్లు అర్హ తన డైలాగ్‌లతో స్క్రీన్ ప్రెజెన్స్‌కి ఈ సినిమాలో భరతుడి పాత్ర ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ముఖ్యంగా ఆమె డైలాగ్ డెలివరీ హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు.
 
శాకుంతలం సినిమాలో చివరి 15 నిమిషాల్లో అల్లు అర్హ యోగ్యతగా కనిపించిందని, తొలిసారి కెమెరా ముందు వచ్చినా తన నటనతో మెప్పించిందని ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అల్లు కుటుంబ వారసత్వాన్ని భవిష్యత్తులోనూ కొనసాగిస్తుంని కొందరు వ్యాఖ్యానించడం విశేషం.
 
అల్లు అర్హ గురించి సామ్ మాట్లాడుతూ, సెట్స్‌లో అల్లు అర్హా తెలుగులో మాట్లాడినప్పుడు చాలా క్యూట్‌గా అనిపించిందని చెప్పింది. వందలాది మంది ముందు ఎలాంటి భయం లేకుండా అల్లు తగిన డైలాగులు చెప్పిందని సమంత తెలిపింది. 
 
ఈ రోజుల్లో పిల్లలు ఎలాగైనా ఇంగ్లీషు నేర్చుకోగలరు.. కానీ తెలుగును కూడా అర్హ ఇరగదీసింది. తెలుగును నేర్పించిన అల్లు అర్జున్, స్నేహా రెడ్డిలకు హ్యాట్సాఫ్ అని చెప్పింది సామ్.
 
శాకుంతలం అనే పౌరాణిక కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, నీలిమ గుణ నిర్మించారు. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సమంత కెరీర్‌లో ఇదే తొలి పౌరాణిక చిత్రం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అకీరానందన్ సినీ ఎంట్రీ.. హీరోగా కాదు.. మ్యూజిక్ డైరక్టర్‌గా...