Webdunia - Bharat's app for daily news and videos

Install App

హనీమూన్ గురించి ఆలోచించట్లేదు.. పెళ్లికి తర్వాత హీరోయిన్లకు కెరీర్ ఉండదా?: సమంత

రాజుగారి గది-2 సినిమాలోని తన పాత్రకు లభిస్తున్న స్పందన చూస్తుంటే సంతోషంగా వుందని అక్కినేని వారింటి కోడలు సమంత వెల్లడించింది. పెళ్లి తర్వాత హీరోయిన్లకు కెరీర్ ఉండదనే అపోహలకు తాను చెక్ పెట్టాలనుకుంటున్న

Webdunia
ఆదివారం, 15 అక్టోబరు 2017 (16:49 IST)
రాజుగారి గది-2 సినిమాలోని తన పాత్రకు లభిస్తున్న స్పందన చూస్తుంటే సంతోషంగా వుందని అక్కినేని వారింటి కోడలు సమంత వెల్లడించింది. పెళ్లి తర్వాత హీరోయిన్లకు కెరీర్ ఉండదనే అపోహలకు తాను చెక్ పెట్టాలనుకుంటున్నానని ఓ ఇంటర్వ్యూలో సమంత తెలిపింది. అందుకే ప్రస్తుతానికి హనీమూన్ గురించి ఆలోచించట్లేదని... పెళ్లికి తర్వాత తన దృష్టంతా సావిత్రి సినిమాపైనే వుందని స్పష్టం చేసింది. 
 
''ఏమాయ చేశావే'' సినిమాలోనూ చైతూ, తాను రెండుసార్లు, రెండు పద్ధతుల్లో వివాహం చేసుకున్నామని, ఇప్పుడు నిజ జీవితంలోనూ అదే జరిగిందని ఉద్వేగంగా చెప్పింది. గోవా తమకు సెంటిమెంట్ ప్లేస్ కావడంతోనే అక్కడే వివాహం చేసుకున్నట్లు వెల్లడించింది. రాజగారి గది-2 సినిమాలోని తన పాత్రకు లభిస్తున్న స్పందన చూస్తుంటే ఎంతో సంతోషంగా వుందని సమంత తెలిపింది. అక్టోబర్ తనకు లక్కీ నెలగా మారిందని చెప్పుకొచ్చింది.
 
నాగ చైతన్యకు హారర్ సినిమాలు చూడడం అస్సలు ఇష్టం లేకున్నా తనతో కలిసి రాజుగారి గది-2 సినిమా చూశాడని చెప్పింది. తన నుంచి అక్కినేని కుటుంబం ఏమీ ఆశించడం లేదని, కానీ వారు తనకిస్తున్న గౌరవాన్ని కాపాడుకుంటానని తెలిపింది. పెళ్లయ్యాక సినిమాలు మానేయాలన్న ఆలోచన తనకు రాలేదని అన్నారు. తనకు సినిమాలు, వ్యక్తిగత జీవితం రెండూ ముఖ్యమేనని సమంత తేల్చి చెప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments