Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సమంత రుత్ ప్రభు.. సమంత అక్కినేనిగా మారిపోయింది.. ట్విట్టర్లో సమంత

ఇన్నాళ్లు సమంత రుత్ ప్రభు అని వుండిన సమంత పేరు.. సమంత అక్కినేనిగా మారిపోయింది. కానీ ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం ఆమె పేరు రుత్‌ ప్రభు అనే ఉంది. ఇక సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘రాజుగారి గది 2’

Advertiesment
సమంత రుత్ ప్రభు.. సమంత అక్కినేనిగా మారిపోయింది.. ట్విట్టర్లో సమంత
, బుధవారం, 11 అక్టోబరు 2017 (17:07 IST)
అక్కినేని నాగార్జున కుమారుడు, సినీ నటుడు నాగచైతన్య, నటి సమంత మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. నాగచైతన్య, సమంత వివాహం అక్టోబర్ ఆరో తేదీ అందాల తీరం గోవాలో వైభవంగా జరిగింది. వెగాటర్‌ బీచ్‌లోని డబ్ల్యూ రిస్టార్‌లో హిందూ సాంప్రదాయం శుక్రవారం (అక్టోబర్-6) రాత్రి 11:52 నిమిషాలకు సమంత మెడలో నాగచైతన్య తాళి కట్టారు. అక్కినేని రామనాయుడు కుటుంబసభ్యులు సహా సినీ రంగానికి చెందిన పలువురు వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. 
 
మరుసటి రోజు శనివారం (అక్టోబర్ 7) సాయంత్రం 5:30 నుంచి 6:30 మధ్య గోవాలోనే క్రైస్తవ సంప్రదాయ పద్ధతిలో నాగచైతన్య-సమంత వివాహం జరిగింది. పెళ్లికి తర్వాత వారి వారి సినిమా షూటింగ్‌ల్లో సమ్మూ-చైతూ బిజీ అయిపోయారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుండే సమంత.. అక్కినేని నాగచైతన్యను పెళ్లాడిన తర్వాత ఆమె సామాజిక మాధ్యమాల్లో ఒకటైన ట్విటర్‌లో తన పేరును మార్చుకున్నారు. 
 
ఇన్నాళ్లు సమంత రుత్ ప్రభు అని వుండిన సమంత పేరు.. సమంత అక్కినేనిగా మారిపోయింది. కానీ ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం ఆమె పేరు రుత్‌ ప్రభు అనే ఉంది. ఇక సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘రాజుగారి గది 2’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఓంకార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగార్జున, సీరత్‌ కపూర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. 
 
ఇందులో సమంత ఆత్మగా కనిపించబోతున్నారు. అలాగే సమంత.. తమిళ హీరో విజయ్‌తో నటించిన మెర్సల్ (తెలుగులో అదిరింది) చిత్రం దీపావళికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సామ్‌ ప్రస్తుతం తన తర్వాతి చిత్రాలు ‘రంగస్థలం 1985’, ‘సావిత్రి’ షూటింగ్‌లతో బిజీగా ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జాకీచాన్ కూతురు లెస్బియన్‌గా మారిపోయింది.. ఫోటో చూడండి..