Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సిటాడెల్' షూటింగ్‌లో గాయపడిన 'సమంత'

Webdunia
మంగళవారం, 28 ఫిబ్రవరి 2023 (16:31 IST)
టాలీవుడ్ హీరోయిన్ సమంత షూటింగ్‌లో గాయపడ్డారు. ఆమె "సిటాడెల్" అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ కోసం యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో ఆమె గాయపడ్డారు. తన రెండు చేతులకు గాయాలయ్యాయి. గాయపడిన ఫోటోలను ఆమె ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వాటి కింద "యాక్షన్ ఫలితం" అంటూ కామెంట్స్ చేశారు. 
 
మయోసైటిస్ అనే వ్యాధి బారినపడిన సమంత.. ఈ అరుదైన వ్యాధి నుంచి క్రమంగా కోలుకుని తిరిగి షూటింగులలో పాల్గొంటున్నారు. ఈమె నటించిన చిత్రాల్లో "శాకుంతలం" త్వరలోనే విడుదలకానుంది. ఈ నేపథ్యంలో హాలీవుడ్ దర్శకులు రుస్సో బ్రదర్స్ డైరెక్ట్ చేస్తున్న వెబ్ సిరీస్ సిటాడెల్. ఇది భారతీయ వెర్షన్. ఒరిజిన్‌లో ప్రియాంకా చోప్రా, రిచర్డ్ మడ్డెన్, స్టాన్లీ టుస్సీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. త్వరలోనే అమెజాన్ ప్రైమ్‌లో ఇది స్ట్రీమింగ్‌కానుంది. 
 
భారతీయ వెర్షన్‌ సిటాడెల్‌ షూటింగులో ఆమె గాయపడ్డారు. యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరణ సమయంలో దెబ్బలు తగిలాయి. రెండు చేతులకు గాయాలైన విషయాన్ని సమంత తెలిపింది. ఈ మేరకు సామ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ స్టోరీని షేర్ చేసింది. రెండు చేతుల ఫోటో పెట్టి.. "యాక్షన్ ఫలితం" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. యాక్షన్ సన్నివేశాల్లో నటించేందుకు హాలీవుడ్ దర్శకుడు వద్ద ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నప్పటికీ గాయాలు మాత్రం తప్పలేదు అంటూ ఆమె పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధాని ప్రసంగిస్తుండగానే కాల్పులకు తెగబడిన పాకిస్థాన్ సైన్యం!

మురళీ నాయక్‌కు పవన్, మంత్రుల నివాళి.. ఫ్యామిలీకి రూ.50 లక్షల ఆర్థిక సాయం (Video)

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తా : డోనాల్డ్ ట్రంప్

భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి గిరిప్రదక్షిణ

ఛత్తీస్‌గడ్ టెన్త్ ఫలితాలు - టాప్ ర్యాంకర్‌కు బ్లడ్ కేన్సర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments