Vijaydevarakond in helicopter
విజయదేవరకొండ తాజాగా
హిమాచల్ ప్రదేశ్లోని మనాలి ప్రాంతాన్ని హెలికాప్టర్‌లో వీక్షిస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అక్కడి పర్వత ప్రాంతాల్ని తిలకిస్తూ వావ్! అంటూ మురిసిపోతున్నట్లు ఫీలింగ్‌ను వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితమే కశ్మీర్ ప్రాంతంలో ఖుషి సినిమా షూట్‌లో పాల్గొన్నారు. ఆ తర్వాత సమంత షూట్ కోసం గ్యాప్ ఇచ్చారు.
తాజా సమాచారం ప్రకారం సమంత త్వరలో షూటింగ్‌లో పాల్గొననున్నదని తెలుస్తోంది. ఇటీవలే తాను ఫిట్‌గా వున్నట్లు బాక్సింగ్ చేస్తూ ట్రైనీతో ఫొటోలు పెట్టింది. కొత్త షెడ్యూల్ పకారం ఈనెల 27 నుంచి ఖుషీ షూటింగ్ మనాలి తదితర ప్రాంతాల్లో జరగనుంది. మార్చి 8 వరకు షెడ్యూల్ జరగనుందని సమాచారం. ఈ షెడ్యూల్‌లో సమంత కూడా పాల్గొననున్నదని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ షెడ్యూల్ అనంతరం కేరళలో కొంత భాగం తీయనున్నారు. దర్శకుడు శివనిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రిమూవీస్ నిర్మిస్తోంది.