హన్సిక మోత్వాని శింబుతో తన గత రొమాంటిక్ రిలేషన్ గురించి నోరు విప్పింది. ఆ తర్వాత ఆమె లవ్ షాదీ డ్రామా డాక్యుమెంటరీ విడుదలైంది. ఇది సోహెల్ ఖతురియాకు రెండవ వివాహం. 
 
 			
 
 			
					
			        							
								
																	
	 
	గతంలో ఎస్టీఆర్ శింబుతో హన్సిక ప్రేమలో వుండిన సంగతి తెలిసిందే. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో, హన్సిక మోత్వాని తన గత సంబంధం గురించి శింబుతో విడిపోవడం గురించి నోరు విప్పింది. 
	 
	శింబుతో బ్రేకప్ అయిన తర్వాత మరొకరిని రెండోసారి ప్రేమించడానికి చాలా సమయం పట్టిందని హన్సిక మోత్వాని చెప్పింది. ప్రేమపై తనకు నమ్మకం ఉందని తెలిపింది. 
	 
	సోహైల్ తన జీవితంలోకి వచ్చాక ప్రేమ మీద తనకు మరింత నమ్మకం ఏర్పడింది. తన గత రిలేషన్‌షిప్ ముగిసిపోయింది. ప్రస్తుతం తాను కొత్తగా ప్రయాణాన్ని మొదలుపెట్టానంటూ హన్సిక మోత్వానీ చెప్పుకొచ్చింది.