Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిఖిల్, అనుపమ 18 పేజీస్ చిత్రం నుండి లిరికల్ వీడియో

Advertiesment
18 pages poster
, సోమవారం, 5 డిశెంబరు 2022 (18:37 IST)
18 pages poster
వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న "జీఏ 2" పిక్చర్స్ లో రాబోతున్న తదుపరి చిత్రం "18 పేజిస్" నిఖిల్ సిద్దార్థ , అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నారు.మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు.  
 
ఇటీవలే కార్తికేయ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న హీరో నిఖిల్ సిద్దార్థ్ & అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న ఈ "18పేజిస్" ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. ఆయన శిష్యుడు "కుమారి 21ఎఫ్" చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర టీజర్, "నన్నయ్య రాసిన" అనే పాటకు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఈ తరుణంలో 18పేజిస్ చిత్రం నుండి తమిళ స్టార్ హీరో శింబు పాడిన "టైం ఇవ్వు పిల్ల కొంచెం టైం ఇవ్వు"  అనే పాటను విడుదల చేసారు.
 
ప్రతీ ఒక్కరి లైఫ్ లో ప్రేమించడం ఎంత కామనో , బ్రేకప్ కూడా అంతే కామన్. అలా బ్రేకప్ అయినా కుర్రాడు పాడే పాటే "టైం ఇవ్వు పిల్ల కొంచెం టైం ఇవ్వు" శ్రీమణి రచించిన ఈ పాటను
శింబు ఆలపించారు.
"ఈ జనరేషన్ పిల్లగాన్ని కాన నేను
నీలాగా మూవ్ అన్ ఎందుకు అవ్వలేను
I love you రా బేబీ అంటూ డైలీ నువ్వు
What's app లో చేసిన చాట్ కి నువ్వు వాల్యూ ఇవ్వు
మన పాస్ట్ అసలు గురుతే రాదా
నీకు కొంచెమైనా గ్లిటే లేదా" లాంటి లిరిక్స్ యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. నన్నయ్య రాసిన లాంటి క్లాస్ మెలోడీ తర్వత వచ్చిన ఈ క్రేజీ సింగిల్ అంతం పెద్ద హిట్ అవుతుంది అని అర్థమవుతుంది.
 
మేకర్స్  ఇటీవల "టైం ఇవ్వు పిల్ల కొంచెం" అనే పాట హుక్ స్టెప్ ప్రోమోను రిలీజ్ చేసారు. గ్రాండ్ విజువల్స్ తో యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఈ పాట ఉండబోతుంది. అలానే ఈ పూర్తి పాటను నేడు విడుదలచేశారు.
 
ఇదివరకే ఎన్టీఆర్ బాద్ షా  కి "డైమెండ్ గర్ల్" మంచు మనోజ్ పోటుగాడికి  కి "బుజ్జి పిల్ల" యంగ్ హీరో రామ్ పోతినేని వారియర్ కి "బుల్లెట్ సాంగ్" ను పడిన శింబు ఇప్పుడు నిఖిల్ నటిస్తున్న 18పేజిస్ కోసం "టైం ఇవ్వు పిల్ల టైం ఇవ్వు" అనే పాటను పాడాడు. వాటి మాదిరిగానే ఈ పాట కూడా పెద్ద హిట్ అవ్వబోతుందని అర్ధమవుతుంది. మంచి అంచనాలను నెలకొల్పిన ఈ చిత్రాన్ని క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 23 రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే అధికారిక ప్రకటన చేసారు. చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

త్వరలోనే మీర్జాపూర్ వెబ్ సిరీస్ సీజన్ స్ట్రీమింగ్