ఇప్పటికే ధమాకా, రావణాసురుడు, టైగర్ నాగేశ్వరరావు, చిరంజీవితో భోళాశంకర్ వంటి సినిమాలతో బిజీగా వున్న మాస్ రవితేజ తాజాగా మరో సినిమా చేస్తున్నాడు. నిమాటోగ్రాఫర్ కార్తీక్ గడ్డంనేని దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే పోలాండ్‌లో ప్రారంభమైంది. మరో రెండు వారాలపాటు అక్కడే షూటింగ్ జరగనుంది. తదుపరి షెడ్యూల్ హైదరాబాద్‌లో ఉంటుందనీ, దాని తర్వాత దేశంలోనే మరో అవుట్‌డోర్ షెడ్యూల్ ఉంటుందని యూనిట్ వర్గాలు తెలియజేస్తున్నాయి.
పేరు పెట్టని ఈ సినిమాలో రవితేజ సరికొత్తగా కనిపించనున్నారు. డార్క్ కామెడీ ఫ్లేవర్‌తో యాక్షన్ డ్రామాగా ఉంటుంది. ఇందులో పెద్దగా పాటలు కూడా వుండవని తెలుస్తోంది. . యాక్షన్ పార్ట్ ప్రత్యేకంగా నిలుస్తుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ (ఏక్ మినీ కథ ఫేమ్), నవదీప్ నటిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.