Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మృగాళ్లను కఠినంగా శిక్షించాలి : చిరంజీవి డిమాండ్

Advertiesment
chiranjeevi
, బుధవారం, 26 అక్టోబరు 2022 (08:54 IST)
హైదరాబాద్ నగరంలో ఆడ బిడ్డలకు రక్షణ లేకుండా పోతోంది. ప్రతి నిత్యం ఏదో ఒక ప్రాంతాల్లో అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నాలుగేళ్ల చిన్నరిపై అత్యాచారం జరిగింది. దీనిపై మెగాస్టార్ చిరంజీవి తీవ్రంగా కలత చెందారు. మృగాళ్లను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు.
 
నాలుగేళ్ల పిసిబిడ్డపై పాఠశాలలో జరిగిన అత్యాచారం, అఘాయిత్యం తనను బాగా కలిసివేసినట్టు చెప్పారు. ఆటవిక సంస్కృతి నుంచి ఆనవాళ్ళు మోసుకొస్తున్న కొందరు మృగాళ్ళ వికృత చేష్టలకు కఠినాతి కఠినమైన శిక్షలు వేగవంతంగా విధించాలని చిరంజీవి పేర్కొన్నారు. 
 
అంతేకాకుండా, ప్రభుత్వాలు అన్ని విద్యా సంస్థల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు యుద్ద ప్రాతిపదికన తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. భావి తరాలకు భరోసా కల్పించడం మనందరి సమిష్టి బాధ్యతగా భావిస్తున్నాను అని పేర్కొన్నారు. ఇలాంటి భయానక ఘటనలు ఇంకెప్పుడూ జరగకుండా చూడాలని పిలుపునిచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేజీఎఫ్‌కు చెక్ పెట్టిన కాంతారా.. రూ.200కోట్లకు పైగా కలెక్షన్లు