Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పన్నెండేళ్ల కెరీర్‌లోనూ ప్రయోగాలు చేస్తున్న ఆది సాయి కుమార్‌

Advertiesment
Adi Sai Kumar
, శనివారం, 25 ఫిబ్రవరి 2023 (16:29 IST)
Adi Sai Kumar
సినిమా ప్రపంచంలో హీరోలు సక్సెస్ అవ్వడం ఒకెత్తు అయితే.. ఆ సక్సెస్‌ను కాపాడుకునేందుకు పడే కష్టం ఒకెత్తు. అభిమానుల అంచనాలు అందుకుంటూ నిర్మాతలకు లాభాలు తెచ్చి పెట్టే హీరోగా నిలదొక్కుకోవడం ఎంతో కష్టం. అయితే టాలీవుడ్‌కు సాయి కుమార్ కుమారుడిగా, వారసత్వ హీరోగా ఆది ఎంట్రీ ఇచ్చాడు. ప్రేమ కావాలి సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. తనకంటూ నటుడిగా ఓ ప్రత్యేక ముద్రను వేశారు. ఆది నటుడిగా కెరీర్‌ను మొదలుపెట్టి నేటికి పన్నెండేళ్లు పూర్తయ్యాయి.
 
ఈ పుష్కర కాలంలో ఆది ఎన్నెన్నో ప్రయోగాలు చేశారు. ఫలితంతో సంబంధం లేకుండా తన అభిమానులను అలరించేందుకు విభిన్న జానర్లను ప్రయత్నిస్తూనే వచ్చారు. ఆయన కెరీర్‌లో ప్రేమ కావాలి, లవ్‌లీ, సుకుమారుడు, శమంతకమణి, ఆపరేషన్ గోల్డ్ ఫిష్, బుర్రకథ, శశి ఇలా అనేక రకాల కాన్సెప్టులతో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు.
 
గత ఏడాది ఐదు సినిమాలతో అభిమానుల ముందుకు వచ్చారు. కరోనా వల్ల ఆది నటించిన సినిమాలు కాస్త ఆలస్యం అయ్యాయి. దీంతో గత ఏడాది తీస్ మార్ ఖాన్, క్రేజీ ఫెల్లో,బ్లాక్, అతిథి దేవో భవ, టాప్ గేర్ అంటూ ఇలా వరుసగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. చివరగా వచ్చిన టాప్ గేర్ సినిమాకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
 
ఇప్పుడు ఆది సాయి కుమార్ ఓటీటీలోనూ ఎంట్రీ ఇచ్చారు. పులి మేక అనే వెబ్ సిరీస్‌లో ఆది సాయి కుమార్ నటించారు. ప్రస్తుతం ఈ పులి మేక వెబ్ సిరీస్‌ జీ5లో ట్రెండ్ అవుతోంది. ఫోరెన్సిక్ టీమ్ హెడ్ ప్రభాకర్ శర్మ పాత్రలో ఆది కనిపించిన తీరు, నటించిన సీన్ల గురించి అంతా చర్చించుకుంటున్నారు. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉన్నా కూడా ఇలా ఓటీటీలోనూ నటించి ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చారు.
 
ఇలా ఆది తన పన్నెండేళ్ల కెరీర్‌లో ఎన్నో ప్రయోగాలు చేశారు. మంచి సినిమాలు ప్రేక్షకులకు అందించాలనే ప్రయత్నాన్ని మాత్రం ఎప్పుడూ ఆపలేదు. త్వరలోనే ఆది నుంచి రాబోతున్న కొత్త ప్రాజెక్టుల వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ దాస్ కా ధమ్కీ షూటింగ్ పూర్తి