Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

ఠాగూర్
ఆదివారం, 6 జులై 2025 (11:58 IST)
నార్త్ అమెరికాలో జరుగుతున్న తానా వేడుకల్లో హీరోయిన్ సమంత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ వేదికపై ఆమె మాట్లాడుతూ, తానా వేడుకల్లో పాల్గొనడానికి 15 యేళ్లు పట్టిందంటే నమ్మలేకపోతున్నా. ప్రతి యేడాది తానా, ఇక్కడ ఉన్న తెలుగువారి గురించి వింటూనే ఉంటాను. నా తొలి చిత్రం "ఏమాయ చేసావె" నుంచి నన్ను మీ నిషిలా భావించారు. నాపై ప్రేమను చూపించారు. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు చెప్పడానికి నాకు ఇన్ని ఏళ్లు పట్టిందన్నారు. 
 
కెరీర్ పరంగా ముఖ్యమైన దశలో ఉన్నాను. ట్రాలాలా పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించినా నిర్మాతగా శుభంతో తొలి అడుగు వేశా. నార్త్ అమెరికాకు చెందిన తెలుగువారు మా చిత్రాన్ని ఎంతగానో మెచ్చుకున్నారు. మంచి ఫలితాన్ని అందించారు. జీవితంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. ఏదైనా తప్పు చేసినా, మీరు ఎపుడూ నా వెంట ఉన్నారు. అందుకు గర్వపడుతున్నా.. ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా, ఏ పరిశ్రమలో పని చేసినా తెలుగు ప్రేక్షకులు నన్ను చూసి గర్వపడతారా? లేదా? అనే ఆలోచిస్తాను. ఇన్నేళ్ల ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు. మీరు నాకొక గుర్తింపు, కుటుంబాన్ని ఇచ్చారు. ఓబేబీ మిలియన్ డాలర్ క్లబ్‌లోకి చేరడం వల్లే మీవల్లే సాధ్యమైంది. ప్రాంతాలను బట్టి మీరు నాకు దూరంగా ఉండొచ్చు. కానీ మీరెప్పటికీ నా మనసులోని ఉంటారు అని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

న్యాయ విద్యార్థినిపై అత్యాచారం.. ఆ తర్వాత అక్కడే మద్యం సేవించిన నిందితులు

మాలి దేశంలో పెట్రేగిన ఉగ్రవాదులు - ఏపీ కార్మికుడు కిడ్నాప్

పెళ్లికి నిరాకరించిన పెద్దలు - ప్రకాశం జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య

విజయ్‌కు ఎన్డీయే ఆహ్వానం.. స్నేహాస్తం అందించిన మాజీ సీఎం

ఆనంద నిలయం నమూనాలో మాంసాహార హోటలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments