Publish Date: Wed, 18 Jun 2025 (19:42 IST)
Updated Date: Wed, 18 Jun 2025 (19:46 IST)
స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తన వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితంలో వినోద పరిశ్రమలో చర్చనీయాంశంగా మారుతోంది. తాజాగా సమంత జిమ్ నుంచి బయటికి వచ్చిన వెంటనే ఆమెను ఫోటోగ్రాఫర్లు చుట్టుముట్టారు. ఆమెను ఫోటోలు తీసేందుకు ఎగబడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
జిమ్ నుంచి బయటికి రాగానే ఫోటోగ్రాఫర్లు దూకుడుగా ప్రవర్తించారు. ఫోటోలు తీయొద్దని ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఆమె ఎక్కడికి వెళ్లినా ఆమె వెంటపడ్డారు. ఫోటోలు తీయడం ఆపండి అంటూ ఆమె చెప్తున్నా.. వారు పట్టించుకోలేదు. దీంతో సమంత అసహనం వ్యక్తం చేసింది.
ఇంకా ఫోటోగ్రాఫర్లపై సీరియస్ అయ్యింది. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాల కామెంట్లు పోస్టు చేస్తున్నారు. సమంత అభిమానులు ఆమె మద్దతు ఇస్తున్నారు. మీడియా వ్యక్తులు ఆమె గోప్యతను గౌరవించాలని అంటున్నారు.