Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంతకు పుట్టినరోజు.. యు టర్న్ సెట్స్‌లోనే కేక్ కట్ చేసిన మధురవాణి

ఏ మాయ చేసావె సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన అందాల తార సమంత. తన తొలి సినిమా హీరో అక్కినేని నాగచైతన్యనే ప్రేమించి వివాహం చేసుకున్న ఈమె.. పెళ్లయ్యాక కూడా సినిమా చేసుకుంటూ పోతోంది. రాజుగారి గది సినిమాలో ఆ

Webdunia
శనివారం, 28 ఏప్రియల్ 2018 (15:20 IST)
ఏ మాయ చేసావె సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన అందాల తార సమంత. తన తొలి సినిమా హీరో అక్కినేని నాగచైతన్యనే ప్రేమించి వివాహం చేసుకున్న ఈమె.. పెళ్లయ్యాక కూడా సినిమా చేసుకుంటూ పోతోంది. రాజుగారి గది సినిమాలో ఆత్మగా కనిపించి.. పెళ్లికి తర్వాత తొలి హిట్ కొట్టిన సమంత.. రంగస్థలం ద్వారా రెండో హిట్‌ సినిమాను తన ఖాతాలో వేసుకుంది. 
 
రామ్ చరణ్ సరసన రామలక్ష్మిగా నటించిన సమంత పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో సమంత ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. ఇక త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ''మహానటి'' కూడా ఆమెకు పేరు సంపాదించిపెడుతుందని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు. ఇంకా ''యు టర్న్'' సినిమాకు నిర్మాతగానే కాకుండా.. ఆ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
 
ప్రస్తుతం ఈ సినిమా షూటింగు దశలో వుంది. కన్నడలో విడుదలైన 'యు టర్న్' సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. కన్నడలో తెరకెక్కించిన పవన్ కుమార్ ఈ రీమేక్‌కు దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇందులో జర్నలిస్ట్‌గా సమంత కనిపిస్తోంది. ఈ సినిమా ఓవర్ బడ్జెట్ కాకపోవడంతో పారితోషికం కూడా సమంత తీసుకోలేదని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. 
 
సినిమా సక్సెస్ అయిన తరువాత లాభాల్లో వాటాను పొందేలా మాట్లాడుకుందని సమాచారం. ఈ తరహా అగ్రిమెంట్‌పై సమంత సినిమా చేయడం ఇదే తొలిసారి అని సమాచారం. ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న సమంత తన పుట్టిన రోజును కూడా సెట్స్‌లోనే జరుపుకుంది. సెట్‌లోనే కేక్ కట్ చేసింది.

ఈ సినిమా యూనిట్ సభ్యులంతా సమంతకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తన పుట్టిన రోజున బ్రేక్ తీసుకోకుండా సమంత సెట్స్‌లోనే గడుపుకోవడం గమనార్హం. ఇక మహానటిలో సమంత మధురవాణి రోల్‌లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పిల్లలు లేని స్త్రీలను ప్రెగ్నెంట్ చేస్తే రూ. 13 లక్షలు, బీహారులో ప్రకటన, ఏమైంది?

15 చోట్ల పగిలిన తల... 4 ముక్కలైన కాలేయం... బయటకొచ్చిన గుండె... జర్నలిస్ట్ హత్య కేసులో షాకింగ్ నిజాలు!

ఓయో రూమ్స్: బుకింగ్ పాలసీలో ఆ సంస్థ తెచ్చిన మార్పులేంటి? జంటలు తమ రిలేషన్‌కు ఆధారాలు ఇవ్వాలని ఎందుకు చెప్పింది?

భర్త పిల్లలను వదిలేసి బిచ్చగాడితో పారిపోయిన మహిళ.. ఎక్కడ?

పులిని చుట్టుముట్టిన సఫారీ వాహనాలు.. హైకోర్టు సీరియస్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

తర్వాతి కథనం
Show comments