Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒక దశలో సినిమాలు వద్దనుకున్నానన్న సమంత.. ఏఎన్నార్‌ బయోపిక్‌ రెడీ..

''ఏ మాయ చేసావే'' సినిమాతో తెరంగేట్రం చేసి.. ఆ చిత్రంలో హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్యనే ప్రేమించి వివాహం చేసుకున్న టాలీవుడ్ అగ్రహీరోయిన్ సమంత.. పెళ్లయ్యాక కూడా సినిమా చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్త

Advertiesment
ఒక దశలో సినిమాలు వద్దనుకున్నానన్న సమంత.. ఏఎన్నార్‌ బయోపిక్‌ రెడీ..
, బుధవారం, 25 ఏప్రియల్ 2018 (09:01 IST)
''ఏ మాయ చేసావే'' సినిమాతో తెరంగేట్రం చేసి.. ఆ చిత్రంలో హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్యనే ప్రేమించి వివాహం చేసుకున్న టాలీవుడ్ అగ్రహీరోయిన్ సమంత.. పెళ్లయ్యాక కూడా సినిమా చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తోంది. అక్కినేని వారింటి కోడలిగా మారినా నటనకు ప్రాధాన్యత గల పాత్రలు రావడంతో సినిమాలకు దూరం కాలేకపోతున్నానని చెప్పింది. 
 
అక్కినేని వారింటి కోడలిగా మారాక కూడా సినీ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ.. ఇటీవలే రంగస్థలం హిట్‌ను తన ఖాతాలే వేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. త్వరలో 'మహానటి' చిత్రంతో ప్రేక్షకులను పలకరించనుంది. నటనను కూడా ఓ ఉద్యోగంగా భావించానని.. అప్పటి నుంచి జీవితమే మారిపోయిందని సమంత చెప్పింది. మారిన తన ఆలోచన తనకెంతో మేలు చేసిందని పేర్కొంది.
 
తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ.. వ్యక్తిగత జీవితంతో పాటు నటనను ఆస్వాదిస్తున్నానని చెప్పింది. ఒక దశలో సినిమాలు మానేద్దామని అనుకున్నానని, కానీ మంచి కథలు రావడంతో సినిమాలను వదులుకోవాల్సిన అవసరం కలగలేదని తెలిపింది. 
 
కొత్త పాత్రలు తనకు దగ్గరవుతుండటంతో ఎంతో హ్యాపీగా వున్నానని, ఒకప్పుడు హిట్ సినిమాల్లో నటించినా వాటిని ఆస్వాదించలేని పరిస్థితి నుంచి ఇప్పుడు బయటపడ్డానని వెల్లడించింది. తన సినిమాలకు ప్రేక్షకుల నుంచి లభిస్తున్న ఆదరణ తనకెంతో ధైర్యాన్నిస్తోందని సమంత వెల్లడించింది.
 
మరోవైపు ఎన్టీఆర్ బయోపిక్ త్వరలో సెట్స్‌పైకి రానున్న తరుణంలో అక్కినేని నాగేశ్వరరావు జీవితకథ ఆధారంగా త్వరలో సినిమా రూపుదిద్దుకోనుంది. అక్కినేని నాగేశ్వరరావు బయోపిక్‌కి సంబంధించిన పనులు కూడా సైలెంట్‌గా మొదలైపోయాయనే ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
కొన్ని నెలల క్రితమే అక్కినేని జీవితానికి సంబంధించిన రీసెర్చ్ వర్క్ మొదలైందని సమాచారం. అక్కినేని సినిమా ప్రయత్నాలు మొదలు.. ఆయన అంతిమయాత్ర వరకూ ఈ బయోపిక్‌లో ఉంటుందట. యంగ్ ఏఎన్నార్‌గా చైతూ, ఆ తర్వాత దశలో ఏఎన్నార్‌గా నాగార్జున కనిపిస్తారని సినీ జనం అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ విషయంలో శ్రీముఖిని ఆదర్శంగా తీసుకోవాల్సిందే.. ఎందుకంటే?