Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లైవ్ ఇంటర్వ్యూ చేస్తూ స్విమ్మింగ్‌పూల్‌లో పడిన బీబీసీ రిపోర్టర్ (Video)

ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా కామన్వెల్త్ 2018 క్రీడా పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీలను కవర్ చేసేందుకు దేశవిదేశాలకు చెందిన మీడియా సంస్థలకు చెందిన విలేకరులకు ఇక్కడే ఉన్నారు. అయితే, ఈ క్రీడలను కవర

Advertiesment
లైవ్ ఇంటర్వ్యూ చేస్తూ స్విమ్మింగ్‌పూల్‌లో పడిన బీబీసీ రిపోర్టర్ (Video)
, బుధవారం, 11 ఏప్రియల్ 2018 (16:45 IST)
ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా కామన్వెల్త్ 2018 క్రీడా పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీలను కవర్ చేసేందుకు దేశవిదేశాలకు చెందిన మీడియా సంస్థలకు చెందిన విలేకరులకు ఇక్కడే ఉన్నారు. అయితే, ఈ క్రీడలను కవర్ చేస్తున్న బీబీసీ రిపోర్టర్ ఒకరు స్విమ్మింగ్‌పూల్‌లో పడిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
బీబీసీ బ్రేక్‌ఫాస్ట్ షో కోసం స్విమ్మింగ్‌లో మెడల్ సాధించిన ఇంగ్లండ్ టీమ్‌తో బీబీసీ రిపోర్టర్ మైక్ బుషెల్ ఇంటర్వ్యూ తీసుకుంటున్నాడు. అప్పుడు ఆ స్విమ్మర్స్.. స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని ఉన్నారు. వాళ్ల కాళ్లు స్విమ్మింగ్ పూల్‌లో ఉన్నాయి. దీంతో ఆ రిపోర్టర్ కూడా వాళ్లతో లైవ్ ఇంటర్వ్యూ చేస్తూ.. వాళ్ల పక్కన కొంత సేపు కూర్చున్నాడు. తర్వాత తిన్నగా పూల్‌లోకి దిగాడు. 
 
రిపోర్టింగ్ చేస్తూనే మరో అడుగు ముందుకు వేయబోయాడు. అంతే కాలు జారి పూల్‌లోనే మునిగిపోయాడు. వెంటనే తేరుకొని సారీ చెబుతూ.. మళ్లీ తన రిపోర్టింగ్ స్టార్ట్ చేశాడు. ఇక.. ఈ రిపోర్టర్‌కు జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్‌ను చూసి ఇంటర్వ్యూ ఇస్తున్న ఇంగ్లండ్ టీమ్ తెగ నవ్వేశారు. వాళ్లే కాదు.. నెటిజన్లు కూడా ఆ వీడియోను చూసి నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ వీడియోను మీరూ చూడండి. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గోల్డ్ కోస్ట్ 2018 : డబుల్ ట్రాప్‌లో శ్రేయాసి సింగ్‌కు గోల్డ్ మెడల్