Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ విషయంలో శ్రీముఖిని ఆదర్శంగా తీసుకోవాల్సిందే.. ఎందుకంటే?

ప్రముఖ యాంకర్ శ్రీముఖి ఒకప్పుడు ఎంత బరువు ఉండేదో తెలుసా... 10వ తరగతి, ఇంటర్ చదివే రోజుల్లో శ్రీముఖి ఎంత వెయిట్ ఉండేదో తెలిస్తే ఆమె ఫ్యాన్స్ అవాక్కవ్వడం ఖాయం. అంతేకాదు శ్రీముఖి గురించి వాళ్ళ అమ్మ చెప్పిన టాప్ సీక్రెట్ గురించి కూడా తెలిస్తే జనానికి మరో

Advertiesment
ఆ విషయంలో శ్రీముఖిని ఆదర్శంగా తీసుకోవాల్సిందే.. ఎందుకంటే?
, మంగళవారం, 24 ఏప్రియల్ 2018 (22:08 IST)
ప్రముఖ యాంకర్ శ్రీముఖి ఒకప్పుడు ఎంత బరువు ఉండేదో తెలుసా... 10వ తరగతి, ఇంటర్ చదివే రోజుల్లో శ్రీముఖి ఎంత వెయిట్ ఉండేదో తెలిస్తే ఆమె ఫ్యాన్స్ అవాక్కవ్వడం ఖాయం. అంతేకాదు శ్రీముఖి గురించి వాళ్ళ అమ్మ చెప్పిన టాప్ సీక్రెట్ గురించి కూడా తెలిస్తే జనానికి మరో షాక్ తప్పదు. 
 
బుల్లితెర మీద మంచి యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుంది శ్రీముఖి. అంతేకాదు సినిమాల్లోను అడపాదడపా చిన్నాచితకా క్యారెక్టర్లను చేస్తూ వస్తోంది. ముందు నుంచి కాస్త బొద్దుగా కనిపించిన శ్రీముఖి ఇంకా లావైపోతే ఛాన్సులు తగ్గిపోతాయన్న ప్రచారం జరిగింది. తాను చదువుకునే రోజుల్లో 100 కిలోలు ఉండేదాన్నని శ్రీముఖి చెప్పింది.
 
తింటే ఆయాసం, నడిస్తే నీరసం, కూర్చుంటే లేవలేక నానా తిప్పలు పడేదానని శ్రీముఖే చెప్పింది. స్కూల్‌మేట్స్ చేసిన కామెంట్స్ అన్నీ ఇన్నీ కావంట. ఎలాగైనా బరువు తగ్గాలని శతవిధాలా ప్రయత్నించి చివరకు అనుకున్నది సాధించిందట. పట్టుబట్టి కేవలం 8 నెలల్లో 40 కిలోల బరువు తగ్గిందట. బరువు తగ్గడానికి ఏయే కసరత్తు చేయాలో అన్నీ చేసేశానని, ఏమేమీ తినాలో అన్నీ తినేశానని, ఏం తినకూడదో అవన్నీ పక్కన పెట్టేశానని అవన్నీ వివరించింది.
 
చిన్నప్పుడు బలపాలను బాగా తినేదట శ్రీముఖి. ఒకవేళ బలపాలను దాచేస్తే మట్టి గోడలను గోకి ఆ మట్టిని తినేదట. ఈ విషయాన్ని శ్రీముఖి తల్లే స్వయంగా చెప్పింది. అప్పటినుంచి శ్రీముఖిని స్నేహితులు తెగ ఆటపట్టించేస్తున్నారట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'భరత్ అనే నేను' కథను పవన్ తిరస్కరించారా? కొరటాల శివ ఏమన్నారు?