Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిల్పకి పాజిటివ్.. ముద్దుపెట్టిన సమంత.. కోవిడ్ సోకిందా? చైతూ పరిస్థితి?

Webdunia
మంగళవారం, 23 జూన్ 2020 (10:32 IST)
Samantha Akkineni
కరోనా అంటేనే జనం జడుసుకుంటున్నారు. పేద, ధనిక, చిన్నా పెద్దా తేడా లేకుండా కరోనా చుక్కలు చూపిస్తోంది. ప్రస్తుతం సెలెబ్రిటీలు కోవిడ్‌తో జడుసుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేశ్‌కి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ఇక ఇదే తరహాలో టాలీవుడ్‌లోని ప్రముఖ నటులు హీరో నాగ చైతన్యకి ఆయన భార్య స్టార్ హీరోయిన్ సమంత‌కి కూడా కరోనా సోకిందేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
 
సమంత నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు, ఇక తాను తాజాగా తన ఫ్రెండ్ ఫ్యాషన్ డిజైనర్ శిల్పకి బుగ్గపై ముద్దు పెడుతూ ఉన్న ఓ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫోటో పోస్ట్ చేసిన కొన్ని రోజులకే శిల్పకి కరోనా పాజిటివ్ అని తేలింది. శిల్పకి ఒక్కసారిగా కరోనా అని తేలడంతో సమంతకు చైతన్యకు కూడా కరోనా వచ్చిందేమోనని అభిమానులు జడుసుకుంటున్నారు. 
 
అయితే స‌మంత పోస్ట్ చేసిన ఫోటో గ‌తంలోదా లేదంటే రీసెంట్ ఫోటోనా అనే విష‌యంలో క్లారిటీ కోసం ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే.. బిగ్ బాస్ సామ్రాట్ గుర్తుండే ఉంటాడు కదా.. అతని సోదరి ఈ శిల్పా రెడ్డి. ఈమెకు ఫ్యాషన్ డిజైనర్ చాలా మంచి గుర్తింపు ఉంది. చాలా మంది సెలబ్రెటీలకు ఆమె దుస్తులు డిజైన్ చేస్తూ ఉంటారు. 
 
మోడల్‌గా, న్యూట్రిషనిస్ట్‌గా‌, ఫ్యాషన్‌ డిజైనర్‌గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న శిల్పారెడ్డికి ఇప్పుడు కరోనా వైరస్ సోకింది. రెండు వారాల క్రితం ఓ ఫ్యామిలీ ఫ్రెండ్‌ శిల్పా రెడ్డి ఇంటికి వచ్చారు. ఆ తర్వాత ఐదు రోజులకు తనకు, తన భర్తకు కరోనా పాజిటివ్‌గా తేలినట్లు ఆమె వెల్లడించారు. అయితే తమలో కరోనా లక్షణాలేవి కనిపించలేదని పేర్కొన్నారు. పాజిటివ్‌గా తేలడంతో భర్త, ఆమె ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుక్నుట్లు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేలం పాటల్లో నిమ్మకాయకు రూ.5 లక్షల ధర ... ప్రత్యేక ఏంటో తెలుసా?

నీ భార్యను నాకు ఇచ్చేయ్.. పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటా.. భర్తను కోరిన వ్యక్తి.. చివరికి?

Perfume Day 2025: పెర్ఫ్యూమ్‌ డే.. వ్యక్తిగత గుర్తింపు కోసం సిగ్నేచర్ సెంట్‌

ఆన్‌లైన్ బెట్టింగుతో నష్టపోయా, చనిపోతున్నా క్షమించు తమ్ముడూ సెల్ఫీ(video)

కేసీఆర్ పుట్టిన రోజు : ఫ్లెక్సీలను తొలగించండి.. (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments