యాక్ష‌న్‌ హీరో విశాల్ చ‌క్ర ఫ‌స్ట్ లుక్‌, గ్లింప్స్ ఆఫ్ ట్రైల‌ర్ విడుద‌ల‌

Webdunia
సోమవారం, 22 జూన్ 2020 (22:28 IST)
యాక్ష‌న్‌ హీరో విశాల్ హీరోగా ఎం.ఎస్ ఆనంద‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న లేటెస్ట్ మూవీ `చ‌క్ర‌`. విశాల్ ఫిలిం ఫ్యాక్ట‌రీ ప‌తాకంపై విశాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్ర‌ద్దా శ్రీ‌నాథ్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా కీల‌క పాత్ర‌లో రెజీనా క‌సాండ్ర న‌టిస్తోంది. యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందిస్తున్నారు. మ‌నోబాలన్‌, రోబో శంక‌ర్‌, కెఆర్ విజ‌య్, సృష్టిడాంగే ఇత‌ర పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు.
 
కాగా `చ‌క్ర`‌ తెలుగు వెర్ష‌న్‌కి సంబంధించిన పోస్ట‌ర్ విడుద‌‌ల చేశారు యాక్ష‌న్ హీరో విశాల్. ప‌వ‌ర్‌ఫుల్ ‌లుక్‌లో ఉన్న ఈ పోస్ట‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. తాజాగా జూన్ 22 సాయంత్రం 5 గంట‌ల‌కు `చ‌క్ర` గ్లింప్స్ ఆఫ్ ట్రైల‌ర్ పేరుతో వీడియోని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. విశాల్ సూప‌ర్ హి‌ట్ మూవీ `అభిమ‌న్యుడు` త‌ర‌హా బ్యాంక్ రాబ‌రీ, సైబ‌ర్ క్రైమ్ నేప‌థ్యంలో అత్యుత్త‌మ సాంకేతిక విలువ‌ల‌తో కొత్త క‌థ-క‌థనాల‌తో ఈ చిత్రం రూపొందుతోంది.
 
ఈ వీడియోలో విశాల్ ప‌వ‌ర్‌ఫుల్ మాస్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. యాక్ష‌న్ హీరో విశాల్‌, శ్ర‌ద్దా శ్రీ‌నాథ్, రెజీనా క‌సాండ్ర, మ‌నోబాలా, రోబో శంక‌ర్‌, కెఆర్ విజ‌య్, సృష్టిడాంగే త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫి : బాల‌సుబ్ర‌మ‌న్య‌న్‌, సంగీతం: యువ‌న్ శంక‌ర్ రాజా, నిర్మాత: విశాల్‌, ద‌ర్శ‌క‌త్వం: ఎం.ఎస్ ఆనంద‌న్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇరాన్‌తో అణు ఒప్పందం.. తుది నిర్ణయం తీసుకోని డోనాల్డ్ ట్రంప్

వైఎస్సార్ విగ్రహం పైన దాడి చేసిన వ్యక్తి ఓ సైకో, సంయమనం పాటించండి

తెలంగాణ ప్రజలకు చల్లని కబురు : మరో పది రోజుల్లో నైరుతి రుతుపవనాల ప్రవేశం

పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కమ్ములాటలు

అధికార బంగ్లాను ఖాళీ చేసే ప్రసక్తే లేదు.. ఏం చేసుకుంటారో చేసుకోండి... రబ్రీదేవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై బ్లాక్ కిస్‌మిస్ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తిరుపతిలో క్యాన్సర్ విజృంభణను అడ్డుకోవడం: సంరక్షణ చర్యలను విస్తరిస్తోన్న ఎస్‌విఐసిసిఎఆర్

Shatavari Tea, స్త్రీలకు అద్భుతమైన ఆరోగ్యాన్నిచ్చే శతావరి టీ, ఎలా తయారు చేయాలి?

తిప్పతీగ ఆయుర్వేద ప్రయోజనాలు

కిడ్నీ సమస్య వుందని తెలిపే సంకేతాలు

తర్వాతి కథనం
Show comments