అక్కినేని నాగార్జున కోడలు, టాలీవుడ్ హీరోయిన్ సమంత రాజకీయాల్లోకి రానున్నారట. వచ్చే 2019లో జరుగనున్న ఆమె అధికార తెరాస తరపున లోక్‌సభకు పోటీ చేయనున్నారనే వార్త జోరుగా ప్రచారం సాగుతోంది.
అక్కినేని నాగార్జున కోడలు, టాలీవుడ్ హీరోయిన్ సమంత రాజకీయాల్లోకి రానున్నారట. వచ్చే 2019లో జరుగనున్న ఆమె అధికార తెరాస తరపున లోక్‌సభకు పోటీ చేయనున్నారనే వార్త జోరుగా ప్రచారం సాగుతోంది.
దీనిపై ఆమె ప్రతినిధులు స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టంచేశారు. ఆమెకు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన లేదని వారు స్పష్టంగా చెప్పారు.
కాగా, ప్రస్తుతం సమంత తెలంగాణ ప్రభుత్వ చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చేనేత అధికారులు నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొనడంతో ఇలాంటి పుకార్లు పుట్టుకొచ్చాయని తెలుస్తోంది.
ఇదిలావుండగా, సుకుమార్, రాంచరణ్ తేజ్‌ల కాంబినేషన్‌లో వస్తున్న 'రంగస్థలం', 'మహానటి' చిత్రాల్లో సమంత నటిస్తుండగా, తమిళంలో విశాల్ సరసన ఓ చిత్రంలోనూ నటిస్తోంది.