అజార్‌-2కి రంగం సిద్ధం.. 12 ఏళ్ల తర్వాత సల్మాన్, శిల్పాశెట్టి

Webdunia
శనివారం, 27 అక్టోబరు 2018 (16:29 IST)
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో.. 12 ఏళ్ల తర్వాత శిల్పాశెట్టి జతకట్టనుంది. ''అజార్''కి సీక్వెల్‌గా తెరకెక్కే సినిమాలో ఈ జంట మళ్లీ స్క్రీన్‌ని పంచుకోనుంది. ఇప్పటికే సల్మాన్‌ ఖాన్‌, శిల్పా శెట్టి మంచి స్నేహితులు. అంతేకాదు.. వీరిద్దరూ జతకడితే ఆ సినిమా హిట్టే. వీరి కాంబోలోఅజార్‌, గర్వ్‌: ప్రైడ్‌ అండ్‌ హానర్, ఫిర్‌ మిలేంగె, షాదీ కర్కే ఫస్‌ గయా యార్‌ వంటి సినిమాలు సక్సెస్ అయ్యారు. 
 
వీరి కాంబినేషన్‌లో వచ్చిన చివరి చిత్రం 'షాదీ కర్కే ఫస్‌ గయా యార్‌' 2006లో విడుదలైంది. ఆపై సినిమాలకు శిల్పాశెట్టి దూరమైంది. తాజాగా మళ్లీ వెండితెరపై మెరవబోతోంది. ఇదే జోడీతో తెరకెక్కిన 'అజార్‌' చిత్రానికి సీక్వెల్‌గా 'అజార్‌ 2'ను తెరకెక్కించేందుకు 'అజార్‌' చిత్ర దర్శకుడు, సల్మాన్‌ సోదరుడు సొహైల్‌ ఖాన్‌ సన్నాహాలు చేస్తున్నారట. 
 
ఇద్దరు కాలేజ్‌ స్నేహితుల జర్నీని తెలిపే కథాంశంతో 'అజార్‌' సినిమా తెరకెక్కింది. ప్రస్తుతం సల్మాన్‌ 'భారత్‌' చిత్రంలో నటిస్తున్నారు. ఆ తర్వాత దబాంగ్‌-3లో నటించనున్నారు. 2007 నుంచి శిల్పాశెట్టి సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ అప్పుడప్పుడు కొన్ని చిత్రాల్లోని స్పెషల్‌ సాంగ్స్‌లో మెరిశారు. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక సల్మాన్.. శిల్పాశెట్టితో అజార్-2 చేస్తారని టాక్ వస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన.. రాజకీయ అరంగేట్రం చేస్తారా?

ఢిల్లీలో పోలీసులపై పెప్పర్ స్ప్రే దాడి.. ఎందుకో తెలుసా? (Video)

ఖలీదా జియాకు గుండె - ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ - తీవ్ర అస్వస్థత

జె-1 వీసా నిరాకరించిన అమెరికా.. మనస్తాపంతో మహిళా వైద్యురాలు ఆత్మహత్య

Kerala: భార్య తలపై సిలిండర్‌తో దాడి చేసిన భర్త.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments