Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 11 April 2025
webdunia

అజ్ఞాతంలోకి నానా పటేకర్.. అవును.. తనుశ్రీ చెప్పింది నమ్ముతున్నాం..

ఇప్పటికే క్యాస్టింగ్ కౌచ్ వివాదంతో ప్రముఖ దర్శకుడు, నటుడు నానా పటేకర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో నానా పటేకర్ తనను వేధించాడని చేసిన కామెంట్స్ బిటౌన్‌లో చర్చనీయాంశమైనాయి.

Advertiesment
Tanushree Dutta
, సోమవారం, 1 అక్టోబరు 2018 (10:45 IST)
ఇప్పటికే క్యాస్టింగ్ కౌచ్ వివాదంతో ప్రముఖ దర్శకుడు, నటుడు నానా పటేకర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో నానా పటేకర్ తనను వేధించాడని చేసిన కామెంట్స్ బిటౌన్‌లో చర్చనీయాంశమైనాయి. బాలీవుడ్ నటి తనుశ్రీకి స్టార్ హీరోయిన్లు ప్రియాంక చోప్రా, కంగనా రనౌత్, సోనమ్ కపూర్, శిల్పాశెట్టి మద్దతుగా నిలిచారు. 
 
తనుశ్రీ దత్తా చెప్పిన విషయాన్ని నమ్ముతున్నట్టు హీరోయిన్లు వ్యాఖ్యానించారు. హీరోయిన్లు ప్రియాంకా చోప్రా, కంగనా రనౌత్, సోనమ్ కపూర్‌లతో పాటు ఫర్హాన్ అక్తర్ తనుశ్రీకి మద్దతుగా నిలిచారు. ఓ మహిళగా ఆమె చెప్పే విషయాలను నమ్ముతున్నామని, ఆమె మాటలను అందరూ వినాలని అంటున్నారు. 
 
తనుశ్రీతో కలసి సినిమాల్లో నటించిన పాయల్ ఈ విషయమై స్పందిస్తూ, తనకూ 2011లో ఇటువంటి ఘటనే ఎదురైందని వెల్లడించింది. మలయాళంలో నటుడు దిలీప్ కుమార్ వివాదం, టాలీవుడ్‌లో శ్రీరెడ్డి వివాదం బయటకు వచ్చినప్పుడు 'మీ టూ' వంటి ఉద్యమాలు ఊపందుకోవడం లేదని, దీనికి కారణం ఏంటో తెలియడం లేదని చెప్పింది.
 
అంతేగాకుండా దర్శకుడు దివాకర్ బెనర్జీ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని చెబితే, ఆయన చాలా మంచివాడని అన్నారని పాయల్ గుర్తుచేసుకుంది. అనురాగ్ కశ్యప్ సైతం తాను పిచ్చిదాన్నని చెప్పాడని తెలిపింది. దాని ప్రభావంతో తనకు అవకాశాలు తగ్గాయని వ్యాఖ్యానించింది. 
 
ఇదిలా ఉంటే.. నానా పటేకర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని బిటౌన్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న హౌస్ ఫుల్-4 చిత్రంలో అక్షయ్ కుమార్, పూజా హెగ్డే, బాబీ డియోల్‌తో కలిసి నానా పటేకర్ నటిస్తున్నారు. అయితే సినిమా యూనిట్ షూటింగ్ కోసం రాజస్తాన్‌లోని జైసల్మేర్‌కు వెళ్లగా, నానా పటేకర్ మాత్రం షూటింగ్ స్పాట్‌కు రాలేదు. ఆయన ఎక్కడికి వెళ్లారో సినిమా యూనిట్‌కు కూడా చెప్పలేదని సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పూరి కాపీ కొట్ట‌మంటే కాపీ కొట్టా... సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన త‌మ‌న్... ఏం జ‌రిగింది?