Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమలా పాల్ మాజీ భర్తతో సాయి పల్లవి 'ఫిదా'... ఎక్కడంటే...

Webdunia
బుధవారం, 27 మార్చి 2019 (18:22 IST)
ప్రేమమ్ సినిమాతో కేవలం మళయాళంలోనే కాకుండా దక్షిణ చిత్రసీమలో మంచి గుర్తింపుతో పాటుగా ప్రేక్షకులలో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ సాయి పల్లవి. ఆ తర్వాత టాలీవుడ్‌లో చేసిన ఫిదా సినిమాలో తెలంగాణ స్లాంగ్‌తో అద్భుతంగా నటించి క్రేజీ హీరోయిన్‌గా మారిపోయిన సాయి పల్లవి ఆ తర్వాత ఎంసీఏ, పడిపడి లేచే మనసు లాంటి సినిమాలలో నటించి అందాల ఆరబోత లేకుండానే యూత్‌ను ఆకట్టుకుంది. తాజాగా ఆమె గురించి ఓ ఆసక్తికరమైన రూమర్ సినీ వర్గాలలో ప్రచారం జరుగుతోంది.
 
అమలాపాల్ మాజీ భర్త, తమిళ దర్శకుడు విజయ్‌తో సాయిపల్లని ప్రేమలో మునిగిపోయినట్లు వార్త వినిపిస్తోంది. ఇప్పటికే విజయ్ దర్శకత్వంలో సాయి పల్లవి నటించిన నేపథ్యంలో వారి పరిచయం కాస్త ప్రేమగా మారిందని సమాచారం. ప్రస్తుతం వారిద్దరూ సహజీవనం సాగిస్తున్నట్లు తమిళ మీడియాలు వార్తలు వస్తున్న నేపథ్యంలో సాయిపల్లవి అభిమానులు ఈ వార్త విని ఒకింత షాక్‌కు గురవుతున్నారు. 
 
అంతేకాకుండా వీరు త్వరలో వివాహానికి కూడా రంగం సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక కొన్ని రోజులలో వీరు తమ బాంధవ్యంపై అధికారిక ప్రకటన చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల కొన్ని ఇంటర్వ్యూలలో ఇప్పుడప్పుడే తన పెళ్లి ఆలోచన చేసే ఉద్దేశం లేదని చెప్పిన సాయి పల్లవి దీనిపై స్పందించే వరకు నిజం తెలియదు మరి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments