Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీకెండ్ పార్టీకి వెళ్లడంతోనే యాక్సిడెంటా? హెల్త్ బులిటెన్ విడుదల

Webdunia
శనివారం, 11 సెప్టెంబరు 2021 (13:39 IST)
మెగా మేనల్లుడు హీరో సాయి ధరమ్ తేజ్‌కు ప్రస్తుతం అపోలోలో చికిత్స అందిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, త్వరగానే కోలుకుంటారని అపోలో వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. కాగా, శుక్రవారం రాత్రి 7 గంటల 30 నిమిషాల ప్రాంతంలో సాయి ధరమ్ తేజ్‌కు రోడ్డు ప్రమాదం జరిగింది. స్పోర్ట్స్ బైక్ పై ప్రయాణిస్తున్న క్రమంలో బైక్ స్కిడ్ అవ్వడంతో ఈ ప్రమాదం జరిగింది. 
 
ఈ ప్రమాదానికి సంబంధించిన సిసిటీవీ ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు. మెగా కాంపౌండ్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరో సాయి ధరమ్ తేజ్. ఈ మధ్య కాలంలో వరుస విజయాలతో ఫుల్ జోష్‌తో కనిపిస్తోన్న ఈ సుప్రీమ్ హీరో.. శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. 
 
తన స్పోర్ట్స్ బైక్ మీద వెళుతోన్న సమయంలో అదుపుతప్పి కింద పడిపోయాడు. దీంతో వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లడం.. ఆ తర్వాత ఆస్పత్రిలో అతడికి చికిత్స అందించడం చకచకా జరిగిపోయాయి. ఇక, ఈ ప్రమాదంపై ఎన్నో రకాల ఊహాగానాలు వ్యక్తం అవుతూ వచ్చాయి. 
 
ఈ క్రమంలోనే అతడు ఓవర్ స్పీడుగా వెళ్లాడన్న టాక్ కూడా వినిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్‌కు సంబంధించిన సీసీ పుటేజ్ బయటకు వచ్చింది. సీసీటీవీ పుటేజ్ బయటకు వచ్చిన తర్వాత సాయి ధరమ్ తేజ్ ఓవర్ స్పీడుతో వెళ్లడం లేదని స్పష్టం అయింది. రోడ్డ చివరన మట్టి ఉండడం వల్లే అతడి బైక్ అదుపు తప్పినట్లు కూడా అర్థం అవుతోంది. 
 
అయితే, బైక్ అదుపు తప్పిన సమయంలో కంగారు పడిపోయిన అతడు ఫ్రంట్ బ్రేక్‌ను ప్రెస్ చేసి ఉంటాడని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఈ కారణంగానే బైక్ పక్కకు వంగి కింద పడిపోయి ఉంటుందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక, ప్రమాద సమయంలో హెల్మెంట్ ఉండడంతో పెను ప్రమాదం తప్పిందని అంటున్నారు.
 
మరోవైపు.. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్‌కు ర్యాష్ డ్రైవింగ్, అత్యధిక స్పీడ్‌లో వెళ్లడమే యాక్సిడెంట్‌కు కారణమని ప్రాథమిక విచారణలో తేల్చిన పోలీసులు వీకెండ్ కావడంతో పార్టీ అటెండ్ కావడానికి సాయి ధరమ్‌ తేజ్ బయలుదేరినట్లుగా భావిస్తున్నారు. రెగ్యులర్‌గా వీకెండ్‌లలో యువ హీరోలతో పాటు సాయి ధరమ్ తేజ్ పార్టీలకు అటెండ్ అయ్యే వాడని సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

యూఎస్ ఎన్నికలు 2024: ట్రంప్, హారిస్‌లలో ఎవరిది ముందంజ? సర్వేలు ఏం చెబుతున్నాయి?

అసలు వెన్నెముక ఉందా లేదా? సూర్య నమస్కారాలు వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్ర (video)

సీఐడీ చేతికి కాదంబరి జెత్వాని కేసు.. దర్యాప్తు పునః ప్రారంభం

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్‌గా బి.ఆర్.నాయుడు

తల్లికి ఉరేసింది.. ఆపై ఉరేసుకుంది.. అమ్మ కోసం పెళ్లి కూడా చేసుకోకుండా..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

ఎముక పుష్టి కోసం ఇవి తినాలి, ఇలా చేయాలి

వరల్డ్ స్ట్రోక్ డే 2024: తెలంగాణలో పెరుగుతున్న స్ట్రోక్ సంఘటనలు, అత్యవసర అవసరాన్ని వెల్లడించిన హెచ్‌సిఏహెచ్

ఈ సమయాల్లో మంచినీరు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments