కృతి శెట్టి. ఈమె గురించి టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైష్ణవ్ తేజ్ నటించిన తొలి చిత్రం 'ఉప్పెన' అద్భుత విజయంతో ఓవర్నైట్ స్టార్‌గా మారిపోయింది. దీనితో ఈ ముద్దుగుమ్మ పరిశ్రమలో అత్యధికంగా కోరుకునే నటీమణులలో ఒకరిగా మారింది.
ఈ నటికి పరిశ్రమ నుండి చాలా ఆఫర్లు వస్తున్నాయి. లేటెస్ట్ వార్త ఏంటంటే... ఈమె మెగా హీరోతో రొమాన్స్ చేయాలనే ప్రతిపాదనను తిరస్కరించిందట. సాయి ధరం తేజ్ రాబోయే సినిమాలో కృతి శెట్టి మహిళా ప్రధాన పాత్రలో నటించడానికి రెడీ అయ్యిందని ఆమధ్య వార్తలొచ్చాయి. కానీ ఆ ఆఫర్‌ను కృతి శెట్టి మర్యాదగా తిరస్కరించినట్లు చెపుతున్నారు.
కృతి శెట్టి తన తదుపరి ప్రాజెక్టులపై సంతకం చేయడానికి ఏమాత్రం హడావుడి లేదని, ఆమె సినిమాల గురించి ఎంపిక చేసుకుని నటిస్తుందని అంటున్నారు. కృతి కాదనడంతో సాయి ధరమ్ తేజ్ పక్కన నటించే హీరోయిన్ కోసం నిర్మాతలు వెతుకులాటలో పడ్డారట. ఉప్పెనలో సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్‌తో నటించిన కృతి ఎందుకు నటించనని అన్నదో అని చర్చించుకుంటున్నారు.