Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ విషయంలో రోహిత్, కోహ్లి లాభంలేదు, బుమ్రా సూటిగా వేశాడంటే అంతే: దిశా పటాని

Advertiesment
ఆ విషయంలో రోహిత్, కోహ్లి లాభంలేదు, బుమ్రా సూటిగా వేశాడంటే అంతే: దిశా పటాని
, సోమవారం, 24 మే 2021 (12:01 IST)
బాలీవుడ్ భామలకు క్రికెటర్లకు లింక్స్ వుంటున్న సంగతి తెలిసిందే. కాకపోతే ఆ లింకులు ఎప్పుడో ఒకప్పుడు బయటపడుతుంటాయి. బాలీవుడ్ హీరోయిన్లు క్రికెటర్లు గురించి మాట్లాడితే, క్రికెటర్లు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లతో కలిసి పార్టీలకు, ప్రకటనలు ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.
 
ఇక అసలు విషయానికి వస్తే... బాలీవుడ్ ప్రముఖ నటి దిశా పటాని కూడా సినిమాలతో పాటు క్రికెట్ పట్ల ఆసక్తి చూపుతోంది. తన అభిమాన క్రికెటర్ గురించి దిశా పటానీని అడిగినప్పుడు, "నేను టీమ్ ఇండియాలో ఒక మ్యాచ్ విన్నింగ్ క్రికెటర్‌ను ఎన్నుకోవలసి వస్తే, నేను జస్‌ప్రీత్ బుమ్రాను ఎన్నుకుంటాను" అని సమాధానం ఇచ్చారు. మన వద్ద ఉన్న ఆటగాళ్లలో జస్‌ప్రీత్ అత్యుత్తమమైనవాడు అంటోంది.
 
జస్ప్రీత్ బుమ్రా ప్రపంచంలోని అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకరిగా పరిగణించబడ్డాడు. అతను యార్కర్ బంతులను విసిరేయడంలో నిష్ణాతుడనీ, వికెట్ల వైపు బంతిని సూటిగా విసిరేస్తే వికెట్లు గాల్లోకి ఎగిరిపోతాయి. అందుకే దిశా పటాని బుమ్రాను తన ఎంపికగా చేసుకున్నట్లు చెప్పింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను కాదని అంటోంది. కాగా ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీలో 2016 సంవత్సరంలో ఆమె చిరస్మరణీయ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆస‌క్తిగా 'కపటనాటక సూత్రధారి' ట్రైలర్