సల్మాన్ ఖాన్ నటించిన `రాధే` సినిమా 15 ఏళ్ళ వెనక్కు తీసుకెళ్ళిందని విమర్శలు వస్తున్నాయి. ఆనవాయితీగా రంజాన్‌కు సల్మాన్ సినిమా విడుదలకావడం మామూలే. అలాగే ఈసారి విడుదల చేశాడు. అయితే జీ5 ఓటీటీలో దీన్ని చూడడానికి సబ్‌స్రైబ్ కట్టండి. అంటూ ప్రకటన ఇవ్వడంతో దేశంలో చాలా మంది దీన్ని చూశారు. సల్మాన్ ఫాన్ పాలోయింగ్ వల్ల ఆ సినిమా చూడ్డానికి కొన్నిచోట్ల చాలా సేపటికి ఓపెన్ కాకపోవడం విశేషం. ఈ విషయాన్ని సల్మాన్ అభిమాని ఒకరు వీడియోలో షేర్ చేశారు. అంతేకాకుండా హైదరాబాద్‌లో చూసిన కొంతమంది ఈ సినిమాను చూస్తే జాలేసిందనీ, బాలీవుడ్‌ను 15 ఏళ్ళు వెనక్కు తీసుకెళ్ళిందని విమర్శిస్తున్నారు.
చెత్త కామెడీ, యాక్షన్, జాక్షన్, మాట్లాడితే ఫైట్, కథంటూ ఏమీలేదంటూ తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. హీరోగా చేసిన రణ్‌దీప్ హోడా ఈ సినిమాలో విలన్‌గా ఫస్ట్‌టైం చేశాడు. ప్రభుదేవా దర్శకునిగా అతన్ని బిల్డప్ కోసం ఉపయోగించాడు. ఇక హీరోయిన్ దిశాపటానీ ఎందుకు వుందో తెలీదు. జాకీ ష్రాఫ్ పాత్ర జోకర్‌లా వుంది. ఇంతమంది నటీనటులు వుండి కేవలం సల్మాన్‌ను హైలైట్ చేయడం మినహా సినిమాలో పెద్దగా కథంటూ లేదని అభిమాని వీడియో తేల్చిచెప్పింది.
అయితే ఇందులో చిన్నపాటి సందేశం వుంది. దేశంలో యువత డ్రెగ్స్‌కు అలవాటవుతున్నారు. వాటికి దూరంగా వుండడనేది సందేశమట. కనుక దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ వుంది. సినిమాచూసే రెండుగంటల టైమ్‌ను వేస్ట్ చేసుకునేకంటే కరోనా వేక్సిన్ కోసం స్లాట్ బుక్‌చేసుకుని మనల్ని మన వారిని కాపాడుకుందామంటూ హితవు పలికింది. ఇదే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేశారు. కానీ సల్మాన్ అభిమానుల వల్ల ఈ సినిమా మొదటి రోజే విపరీతంగా చూడడం వల్ల ఓటీటీకి మంచి లాభాలే వచ్చాయని తెలుస్తోంది.