Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిపబ్లిక్ కోసం.. త్వరలో ఆస్పత్రి నుంచి సాయి ధరమ్ తేజ్ డిశ్చార్జ్

Webdunia
గురువారం, 23 సెప్టెంబరు 2021 (21:09 IST)
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. ఒకవైపు కొందరు మెగా హీరోలు సోషల్ మీడియాలో తేజ్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు బాగానే ఉందని ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం సాయి ధరమ్ తేజ్ మూడు రోజుల క్రితమే వెంటిలేటర్ నుంచి తొలగించారట. 
 
అలాగే ఐసియు నుంచి ఇప్పుడు సాయి ధరంతేజ్‌ని జనరల్ వార్డ్‌కి మార్చారు. మరొక రెండు మూడు రోజుల్లో తేజ్‌ను డిశ్చార్జ్ చేయొచ్చు అని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హాస్పిటల్ లోనే ఉన్న సాయి ధరమ్ తేజ్ తన కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. 
 
సాయి ధరంతేజ్‌ను పలకరించటానికి ఇప్పటికే పలు టాలీవుడ్ సెలబ్రిటీలు అపోలోకి వెళ్ళిన సంగతి తెలిసిందే. ఇక సినిమాల పరంగా చూస్తే సాయి ధరమ్ తేజ్ తదుపరి సినిమా "రిపబ్లిక్ " అక్టోబర్ 1న విడుదలకు సిద్ధమవుతోంది. దేవ కట్టా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో ఆటో డ్రైవర్లకు పండగే పండగ ... 4 నుంచి రూ.15 వేలు ఆర్థిక సాయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు ఎపుడంటే?

సిందూర్ 2.0 జరిగితే ప్రపంచ పటం నుంచి పాకిస్థాన్‌ను లేపేస్తాం : భారత ఆర్మీ చీఫ్ వార్నింగ్

World Animal Day 2025: ప్రపంచ జంతు దినోత్సవం.. ఈ సంవత్సరం థీమ్‌ ఏంటి.. కొత్త జీవుల సంగతేంటి?

యూట్యూబర్ ముసుగులో శత్రుదేశానికి రహస్యాలు చేరవేత.. వ్యక్తి అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments