Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అక్టోబరు 1న సాయిధరమ్ తేజ్ 'రిపబ్లిక్' రిలీజ్

Advertiesment
అక్టోబరు 1న సాయిధరమ్ తేజ్ 'రిపబ్లిక్' రిలీజ్
, ఆదివారం, 19 సెప్టెంబరు 2021 (15:54 IST)
మెగా ఫ్యామిలీ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన చిత్రం "రిపబ్లిక్". అక్టోబరు ఒకటో తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. దేవకట్టా దర్శకత్వం వహించిన ఈ సందేశాత్మక చిత్రాన్ని జేపీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 
 
పవర్‌ఫుల్ పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాని అక్టోబర్ 1న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
 
కాగా, ఇందులో కలెక్టర్‌ పంజా అభిరామ్‌ పాత్రలో సాయితేజ్‌ నటించారు. ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు ముగిశాయి. 'ఆల్రెడీ విడులైన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్, టీజర్, పాటలకు మంచి స్పందన లభిస్తోంది. సాయితేజ్‌ యాక్టింగ్, దేవ కట్టా స్టైల్‌ ఆఫ్‌ మేకింగ్‌ ప్రేక్షకులను అలరిస్తాయి' అని చిత్రయూనిట్‌ పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రామ్‌లో మహేష్ బాబు?