Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహిళ గొంతులోకి నాలుగు అడుగుల పాము.. ఎలా?

మహిళ గొంతులోకి నాలుగు అడుగుల పాము.. ఎలా?
, గురువారం, 23 సెప్టెంబరు 2021 (15:05 IST)
రష్యాకు చెందిన ఓ మహిళ గొంతులోకి నాలుగు అడుగుల పాము చేరింది. ఈ పామును ఆపరేషన్ ద్వారా బయటకు తీసిన వైద్యులు షాక్ తిన్నారు. ఈ ఒల్లు గగుర్పొడిచే దృశ్యం రష్యాలోని దగస్థాన్ ప్రాంతంలోని లెవాషి అనే గ్రామంలో వెలుగు చూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, సాధారణంగా పల్లెటూర్లలో చాలా మంది ఆరుబయటే పడుకుంటారు. ఆ గ్రామంలో కూడా అలాగే పడుకుంటారు. ఇటీవల అలా ఆరుబయట నిద్రపోతున్న ఒక మహిళకు ఉన్నట్టుండి విపరీతంగా గొంతు నొప్పి వచ్చింది. 
 
దీంతో ఆ బాధకు మేలుకున్న ఆమె తనకు గొంతు నొప్పిగా ఉందని చెప్పింది. కంఠంలో ఏదో కలియ తిప్పేస్తున్నట్లు బాధగా ఉందని మెలికలు తిరిగింది. ఆమె బాధను చూసిన కుటుంబ సభ్యులు ఆందోళన చెంది, వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు.
 
అక్కడి వైద్యులు ముందుగా ఆ మహిళకు మత్తుమందు ఇచ్చి ఆ తర్వాత ఆపరేషన్ చేశారు. అపుడు వారికి ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం ఒకటి కనిపించింది. ఆమె కంఠంలో నాలుగడుగుల పాము దూరింది. అందుకే ఆమె అంత ఇబ్బంది పడుతోంది. చాలా జాగ్రత్తగా ఆ పామును బయటకు తీసిన వైద్యులు దాన్ని చూసి వణికిపోయారు. బాధితురాలి కుటుంబ సభ్యులకైతే నోటమాటలేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుపూర్ లో ధోతి శతాబ్ది వేడుక