Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుపూర్ లో ధోతి శతాబ్ది వేడుక

Advertiesment
తిరుపూర్ లో ధోతి శతాబ్ది వేడుక
విజయవాడ , గురువారం, 23 సెప్టెంబరు 2021 (14:58 IST)
రామ్ రాజ్ కాటన్  ఆధ్వర్యంలో ధోతి శతాబ్ధి వేడుకలను నిర్వహిస్తున్నారు. ధోతి 100 పేరుతో తిరుపూర్లో ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. ధోతిని తన వస్త్రాధరణగా మార్చుకున్నమహాత్మగాంధీ శత వార్షికోత్సవాన్నిపురస్కరించుకొని ఈ కార్యక్రమాన్నినిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 100 మంది అమరవీరులు, 100 మందినేత కార్మికులను సత్కరించనున్నారు. అంతే కాకుండా పర్యావరణ పరిరక్షణ బాధ్యతలో భాగంగా 100 మొక్కలు నాటనున్నారు. చెన్నైలోని కళాక్షేత్ర ఫౌండేషన్ కు చెందిన నృత్యకారులు 'గాంధియా వాజియిల్రామ్రాజ్' పై సాంప్రదాయ నృత్య నాటకాన్నిప్రదర్శించారు. 
 
ఈ కార్యక్రమాన్ని రామ్ రాజ్ కాటన్ ఎండీ కె.ఆర్. నాగరాజన్ ప్రారంభించి మాట్లాడుతూ, "మహాత్ముని వస్త్రధారణ 'జాతీయ వస్త్ర ధారణ, గుర్తింపు'  చిహ్నంగా మారిందన్నారు. 40 వేల మంది చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు గత 40 ఏళ్లుగా వారి చేనేత చక్రానికి 40 ఏళ్లుగా అండగా నిలుస్తున్నామన్నారు. ఈ సందర్భంగా "మహాత్మవై కొండదువొమ్" అనే పుస్తకాన్నిముఖ్యఅతిథి కోయంబత్తూర్ భారతీయ విద్యాభవన్ ఛైర్మన్ డాక్టర్ బి.కె. కృష్ణరాజ్ వనవరాయర్ ఆవిష్కరించడంతోపాటు పుస్తకం మొదటి కాపీని కోయంబత్తూరు రూట్స్ గ్రూప్ అఫ్ ఛైర్మన్ కె. రామస్వామి అందించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెంగుళూరులో పేలుళ్లు - ముగ్గురు మృతి