Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా కాంబినేషన్‌లో భారీ బడ్జెట్ మూవీ

Webdunia
గురువారం, 18 ఏప్రియల్ 2019 (14:30 IST)
సెన్సేషనల్ దర్శకుడు ఎస్. శంకర్‌, మెగాస్టా్ చిరంజీవి కాంబినేషన్‌లో భారీ బడ్జెట్ మూవీ రానుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన సొంత నిర్మాణ సంస్త గీతా ఆర్ట్స్ పతాకంపై నిర్మించనున్నారు. 
 
రాజకీయాలకు స్వస్తి చెప్పి సినిమా రంగంలోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత చిరంజీవి నటించిన చిత్రం "ఖైదీ నంబర్ 150". అపుడే చిరంజీవితో తన బ్యానర్లో ఒక భారీ బడ్జెట్ చిత్రం ఉంటుందని అల్లు అరవింద్ ప్రకటించారు. అయితే వరుసగా చిరంజీవి సినిమాలకి చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తూ వస్తున్నాడు. 
 
ఈ నేపథ్యంలో ఇక అల్లు అరవింద్ బ్యానర్లో చిరంజీవి సినిమా ఉండకపోవచ్చని అంతా అనుకున్నారు. కానీ ఈ ప్రాజెక్టు ఉందనీ.. ఈ సినిమాకి భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకుడిగా వ్యవహరించనున్నాడనేది ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. తెలుగు.. తమిళ భాషల్లో రూపొందే ఒక సినిమా కోసం కథను సిద్ధం చేయమని అల్లు అరవింద్.. శంకర్‌ని కోరారట. 
 
తెలుగులో చిరంజీవి కథానాయకుడైతే, తమిళంలో అజిత్ లేదా విజయ్‌తో గాని ఈ ప్రాజెక్టు చేసేలా మాటలు జరిగాయని చెబుతున్నారు. ప్రస్తుతం చిరంజీవి.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా' చేస్తున్నారు. ఆ తర్వాత కొరటాల, త్రివిక్రమ్ ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. ఇక శంకర్ విషయానికొస్తే 'భారతీయుడు 2' పనులతో బిజీగా వున్నాడు. ఈ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత శంకర్ - చిరంజీవి ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వర్షపు నీటిలో తెగిపడిన విద్యుత్ తీగ.. బాలుడిని అలా కాపాడిన యువకుడు (video)

కళ్లలో కారప్పొడి చల్లి.. కాళ్లుచేతులు కట్టేసి.. కసితీరా కత్తితో పొడిచి చంపేసింది..

Smiling Face Sky: అరుదైన ఖగోళ దృశ్యం.. చంద్రునికి దగ్గరగా శుక్ర-శని గ్రహాలు.. ఆకాశంలో స్మైలీ

జార్ఖండ్‌లో కర్ణిసేన రాష్ట్ర అధ్యక్షుడు అనుమానాస్పద మృతి!!

మాజీ డీజీపీ భర్తను లేపేసిన భార్య.. ఐ హ్వావ్ ఫినిష్డ్ మాన్‌స్టర్ మెసేజ్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments