Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆగ్రా' సినిమా కాదు.. లేబర్ ఆఫ్ లవ్ : హీరోయిన్ రుహానీ శర్మ

ఠాగూర్
ఆదివారం, 25 ఆగస్టు 2024 (10:04 IST)
'ఆగ్రా' సినిమా ఒక మూవీ కాదనీ ఇది ఒక లేబర్ ఆఫ్ లవ్ అని ఆ చిత్ర హీరోయిన్ రుహానీ శర్మ అన్నారు. ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన సన్నివేశాలు లీక్ అయ్యారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటిపై ఆమె స్పందించారు. ఆగ్రా సినిమాలోని తన వైరల్ సన్నివేశాలు లీక్ అయినప్పటి నుంచి తాను తీవ్ర నిరుత్సాహానికి లోనైనట్టు చెప్పారు. 
 
మా కష్టాన్ని, అంకితభావాన్ని, అభిరుచిని ఈ విధంగా ట్రోల్ చేయటం చూస్తుంటే హృదయ విదారకంగా ఉందన్నారు. కళాత్మక చిత్రాన్ని రూపొందించడం అనేది లెక్కలేనన్ని సవాళ్లు, నిద్రలేని రాత్రులు, అచంచలమైన నిబద్ధతతో నిండిన ప్రయాణం దాగివుంటుందన్నారు. ఆగ్రా సినిమా కాదు.. ఇది ఒక లేబర్ ఆఫ్ లవ్, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023లో ప్రదర్శనకు నోచుకుందని గుర్తుచేశారు. 
 
ఏ కళాకారుడికైనా ప్రతిష్టాత్మకమైన గౌరవం, ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుందన్నారు. ప్రశంసలు, అవార్డులను గెలుచుకుందని, సినిమా సభ్యులంతా గుర్తింపునకు నోచుకున్నారన్నారు. తాను ఈ సినిమా ఎంపిక చేసుకున్నందుకు.. ‌ఈ సినిమా టీమ్‌తో కలిసి పని చేసినందుకు గర్వపడుతున్నట్టు చెప్పారు. కళ అనేది ఎల్లప్పుడూ సులభంగా లేదా సౌకర్యవంతంగా ఉండదన్నారు. 
 
నటన సవాళ్లతో కూడుకున్నదని, భావోద్వేగాలను ప్రేరేపించడానికి, మనల్ని ఆలోచింపజేయడానికి ఉద్దేశించబడిందని తెలిపారు. కళాకారుల శ్రమను అర్థం చేసుకుని, సినిమా వైవిధ్యతను అర్థం చేసుకుంటారని తెలిపారు. ప్రేమ, గౌరవంతో ఈ సృజనాత్మక ప్రయాణాన్ని కొనసాగిద్దామని ఆమె విజ్ఞప్తి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుప్రీంకోర్టు జడ్జీలకు చేదు అనుభవం... విమానంలో మందుబాబుల వీరంగం

'పప్పుగాడు' అనే మాట అనలేదు.. జగన్ అంటే అభిమానం: రామ్ గోపాల్ వర్మ (video)

చెన్నైకు 480 కిమీ దూరంలో తీవ్ర వాయుగుండం.. ఏపీకి భారీ వర్షాలు

అయ్యప్పమాల ధరించిన ఆర్టీసీ డ్రైవర్‌కు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ (Video)

లోక్‌సభ సభ్యురాలిగా ప్రియాంకా గాంధీ ప్రమాణ స్వీకారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments