Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్ఆర్ఆర్ చెప్పిన డేట్‌కి రావ‌డం లేదా..? ఈ వార్త నిజ‌మేనా..? (video)

Webdunia
మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (11:40 IST)
ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తాజాగా తెర‌కెక్కిస్తోన్న చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌లతో తెర‌కెక్కిస్తోన్న ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. అయితే... ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన త‌ర్వాత  అనుకున్నప్లానింగ్ ప్ర‌కారం జ‌ర‌గ‌డం లేదు. షూటింగ్ బాగా ఆల‌స్యం అవుతోంది. 
 
ఈ ఆల‌స్యానికి కార‌ణం చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ల‌కు గాయాలు అవ్వ‌డ‌మే. షూటింగ్ మ‌ధ్య‌లో చ‌ర‌ణ్ కాలికి గాయమైంది. అలాగే ఎన్టీఆర్ చేతికి కూడా గాయ‌మైంది. ఈ కార‌ణంగా సినిమా షూటింగ్‌కి దాదాపు నెల‌న్న‌ర పాటు బ్రేక్ ప‌డింది. ఈ ఆల‌స్యాన్ని ఎంత క‌వ‌ర్ చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నా కుద‌ర‌డం లేద‌ట‌. దీంతోఆర్ఆర్ఆర్ ఎనౌన్స్ చేసిన‌ట్టుగా వ‌చ్చే జులైకి రిలీజ్ కావ‌డం క‌ష్టం. 
 
ఖ‌చ్చితంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా ప‌డుతుంది అని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. బాలీవుడ్ హీరో అజ‌య్ దేవ‌గ‌ణ్, కోలీవుడు న‌టుడు, ద‌ర్శ‌కుడు స‌ముద్ర‌ఖ‌ని కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. రామ‌రాజు జోడి సీత పాత్ర‌లో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భ‌ట్ న‌టిస్తుంది.

ఎన్టీఆర్ స‌ర‌స‌న హీరోయిన్‌గా ఎమ్మారాబ‌ర్ట్స్ న‌టిస్తుంద‌ని స‌మాచారం. మ‌రి... ప్ర‌చారంలో ఉన్న ఈ మూవీ రిలీజ్ వాయిదా అనే వార్తల పై రాజ‌మౌళి స్పందిస్తారేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments