Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

''సైరా'' ప్రీ రిలీజ్ ఈవెంట్.. రాజమౌళి స్పీచ్.. మెగాస్టార్ హ్యాపీ హ్యాపీ

Advertiesment
''సైరా'' ప్రీ రిలీజ్ ఈవెంట్.. రాజమౌళి స్పీచ్.. మెగాస్టార్ హ్యాపీ హ్యాపీ
, సోమవారం, 23 సెప్టెంబరు 2019 (11:10 IST)
భారత తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో తెరకెక్కిన ఈ చిత్రం గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, కన్నడ, మళయాల, హిందీ భాషల్లో విడుదల కానుంది. 
 
ఇందులో అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి తదితరులు నటిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ ఈవెంట్‌కి ప్రత్యేక అతిథిగా హాజరైన రాజమౌళి సైరా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 
సైరా కథను అందించిన సీనియర్ రైటర్స్ పరుచూరి బ్రదర్స్‌పై, అలాగే స్వాతంత్ర్య పోరాటానికి నాంది పలికిన తెలుగువాడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రను తెలుగు ప్రజలకు చేరువ చేసిన నిర్మాత రామ్ చరణ్‌పై జక్కన్న ప్రసంశలు కురిపించారు. ఇలాంటి కథలని బయటకు తీసుకురావడం చాలా ఆవశ్యకమని చెప్పుకొచ్చారు. 
 
ఇంకా మాట్లాడాలని వున్నప్పటికీ.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవి లాంటి మహామహులు వెనకుండటంతో ఏమీ మాట్లాడలేకపోతున్నామని రాజమౌళి చెప్పారు. దర్శకుడు సురేందర్ రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. 
 
సైరా ఈవెంట్ జరుగుతున్నప్పుడు వర్షం కురిసింది. ఐతే ఆ వర్షాన్ని ఉద్దేశిస్తూ 'ఇందాక కురిసింది వర్షం కాదండీ, సైరా యూనిట్‌పై, పైన ఉన్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి అక్షింతలు, ఆయన శుభాశీస్సులు' అని చెప్పగానే, వెనుకనే ఉన్న చిరంజీవి ఒక్కసారిగా హర్షం వ్యక్తం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మేకప్ వేసుకుంటే మీరే కనిపిస్తారు.. అందుకే డూప్‌లు పెట్టి చేయలేను: చిరంజీవి