Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సైరాలో చిరు డ్యూయ‌ల్ రోల్ చేస్తున్నారా...?

Advertiesment
సైరాలో చిరు డ్యూయ‌ల్ రోల్ చేస్తున్నారా...?
, శనివారం, 21 సెప్టెంబరు 2019 (20:50 IST)
మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి. స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సంచ‌ల‌న చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. ఇందులో చిరంజీవి మొట్టమొదటి స్వాతంత్ర్య ఉద్యమకారుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో కనిపించనున్నారు. 
 
కాగా భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. అమితాబ్, న‌య‌న‌తార‌, త‌మ‌న్నా, జ‌గ‌ప‌తిబాబు, సుదీప్... త‌దిత‌ర‌  ప్రముఖులు ఈ చిత్రంలో కొన్ని కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇదిలా ఉంటే... ఈ చిత్రానికి సంబందించిన ఒక లేటెస్ట్ న్యూస్ ప్రస్తుతానికి వైరల్‌గా మారిందని చెప్పాలి. 
 
అదేంటంటే... ఈ చిత్రంలో చిరంజీవి రెండు పాత్రల్లో కనిపించనున్నారంట. అంటే ఒక పాత్రలో చిరంజీవి చనిపోగా, మరొక పాత్ర బ్రతికే ఉంటుందని సమాచారం.
 
అయితే... చనిపోయిన చిరంజీవి పోరాటాన్ని, బ్రతికున్న చిరంజీవి సాగిస్తాడని సమాచారం. ప్ర‌చారంలో ఉన్న‌ ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉన్నది అనేది మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. కాగా చిరంజీవి ఇప్పటికే చాలా సినిమాల్లో ద్విపాత్రాభినయంలో కనిపించి అభిమానులందరినీ అలరించాడు. కాగా ఈ చిత్రంలోకూడా చిరు డ్యూయల్ రోల్‌లో కనిపిస్తే ఇక అభిమానులందరికి  పండగే అని చెప్పాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టెన్ష‌న్‌లో నాగార్జున‌... అస‌లు ఏమైంది..?