టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన మన్మథుడు 2 సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. సినిమా హిట్టు ఫ్లాపు అనేది సర్వసాధారణం. అయితే... ఈ సినిమా అంతకుమించి అన్నట్టుగా ఎప్పుడూ లేనంతగా నాగార్జున.. ఇలాంటి సినిమా చేసాడేంటి అనే కామెంట్స్ వచ్చాయి. దీంతో బాగా ఆలోచనలో పడ్డాడట నాగ్.
ఈ సినిమా తర్వాత సోగ్గాడే చిన్నినాయనా సీక్వెల్ బంగార్రాజు చేయాలనకున్నాడు. కథ రెడీ అయ్యింది. తెరకెక్కించేందుకు దర్శకుడు సిద్ధంగా ఉన్నాడు. నిర్మించేందుకు అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ కూడా సిద్ధమే కానీ... ఎందుకనో సెట్స్ పైకి వెళ్లడం లేదు. కారణం ఏంటంటే... నాగార్జున ఈ సినిమా చేయడం కరెక్టా..? కాదా..? అని బాగా ఆలోచిస్తున్నాడట.
ఎందుకంటే... ఇటీవల కాలంలో నాగార్జున నటించిన సినిమాలు సక్సస్ కాలేదు. దీంతో ఈసారి ఎలాగైనాసరే.. మంచి హిట్టు మూవీ చేయాలి అనుకుంటున్నాడట.
అందుకనే ఆచితూచి అడుగులు వేస్తున్నాడట. ఇటీవల ఓ యువ రచయిత సోల్మాన్ కథ చెప్పాడట. ఈ కథ నాగ్‌కి బాగా నచ్చిందట. బంగార్రాజు కన్నా.. ముందుగా ఈ సినిమా చేయాలి అనుకుంటున్నాడట. దీంతో అసలు బంగార్రాజు ఉందా.? లేదా..? అనే టెన్షన్ అభిమానుల్లో మళ్లీ మొదలైంది. మరి... నాగ్ త్వరలోనే నెక్ట్స్ మూవీపై క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.