రోషన్, అనస్వర రాజన్.. ఛాంపియన్ నుంచి గిర గిర గింగిరాగిరే సాంగ్

దేవీ
బుధవారం, 26 నవంబరు 2025 (17:48 IST)
Roshan, Anaswara Rajan
హీరో రోషన్ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ఛాంపియన్ తో అలరించబోతున్నారు. జాతీయ అవార్డు గ్రహీత ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఫస్ట్ సింగిల్- గిర గిర గింగిరాగిరే  ప్రోమో కూడా మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ రోజుగిర గిర గింగిరాగిరే పాట లిరికల్ వీడియో విడుదలైంది.
 
మిక్కీ జే మేయర్ ఈ సాంగ్ ని మెలోడీయస్ ట్రీట్ గా కంపోజ్ చేశారు. మనుసని హత్తుకునే విధంగా కట్టిపడేసేలా వుంది. కాసర్ల శ్యామ్ రాసిన సాహిత్యం గ్రామ జీవితం, బంధాలు, అల్లికలా ఒక ప్రత్యేకతని తీసుకొస్తుంది. రామ్ మిరియాల రా, రస్టిక్  వాయిస్ పాటకు మరింత స్పెషల్ గా మార్చింది.
 
రోషన్ – అనస్వరల మధ్య  కెమిస్ట్రీ అందంగా ఉంది. రోషన్ తన ఎనర్జీ, గ్రేస్‌తో ఆకట్టుకుంటే, అనస్వర తన సహజమైన అందంతో మంత్రముగ్ధులను చేస్తుంది. ఇద్దరి ఆన్-స్క్రీన్ జోడీ మనసుకి దగ్గరగా అనిపిస్తుంది.
 
తోట తరణి ప్రీ-ఇండిపెండెన్స్ కాలాన్ని అద్భుతమైన డీటెయిల్స్‌తో రిక్రియేట్ చేశారు, ఆర్. మధీ కెమెరా వర్క్ ఆ ప్రపంచంలోకి మనల్ని లీనం చేస్తుంది. ఈ చిత్రానికి ఎడిటింగ్ బాధ్యతలను లెజెండరీ కోటగిరి వెంకటేశ్వరరావు నిర్వహిస్తున్నారు.
 
గిర గిర గింగిరాగిరే తో చాంపియన్ సంగీత ప్రయాణం అద్భుతంగా ఆరంభమైయింది. ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రిస్మస్ ప్రేక్షకులకు మనసుని హత్తుకునే సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments