Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Sridevi: హర్ష్ రోషన్, శ్రీదేవి అపల్లా జంటగా బ్యాండ్ మేళం చిత్రం

Advertiesment
Harsh Roshan, Sridevi Appalla

దేవీ

, బుధవారం, 17 సెప్టెంబరు 2025 (13:05 IST)
Harsh Roshan, Sridevi Appalla
కోర్ట్ చిత్రంలో నటించిన హర్ష్ రోషన్, శ్రీదేవీ అపల్లా మరోసారి ఓ అందమైన ప్రేమ కథతో ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు. ఈ క్యూట్ కాంబోని బ్లాక్ బస్టర్ రచయిత కోన వెంకట్ తెరపైకి తీసుకు వస్తున్నారు. ఈ చిత్రాన్ని కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై కావ్య,  శ్రావ్య నిర్మిస్తున్నారు. శివరాజు ప్రణవ్ ఈ చిత్రాన్ని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మ్యాంగో మాస్ మీడియా ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.
 
సంగీతం, ప్రేమ, భావోద్వేగాలు, మనోహరమైన కథతో ఈ మూవీని సతీష్ జవ్వాజీ తెరకెక్కిస్తున్నారు. ఈరోజు మేకర్స్ అధికారికంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను టైటిల్ గ్లింప్స్‌తో ప్రకటించారు. ఈ చిత్రానికి ‘బ్యాండ్ మేళం’ అని టైటిల్‌ను పెట్టారు.  ఎవ్రీ బీట్ హ్యాజ్  యాన్ ఎమోషన్ అనేది ఉప శీర్షిక. టైటిల్ గ్లింప్స్‌ను ఫస్ట్ బీట్ అంటూ రిలీజ్ చేశారు.
 
తెలంగాణ యాసలో విజయ్ బుల్గానిన్ స్వరపరిచిన అందమైన ఓ జానపద గీతంతో గ్లింప్స్ ప్రారంభమైంది. ఈ ఫస్ట్ బీట్‌లో యాదగిరి (హర్ష్ రోషన్) తన ప్రేయసి రాజమ్మ (శ్రీదేవి అపల్ల) కోసం ఇంట్లోకి వచ్చి వెతుకుతుంటాడు. తెలంగాణ యాసలో హీరో హీరోయిన్ల మధ్య జరిగే సంభాషణ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఇక చివర్లో అయితే హార్ట్ టచింగ్ ఎమోషన్, మ్యూజిక్‌తో టైటిల్ గ్లింప్స్ అందరినీ కదిలించేలా ఉంది. ఈ టైటిల్ గ్లింప్స్ చూసిన తరువాత ఓ అందమైన గ్రామీణ ప్రేమ కథను తెరపై చూడబోతోన్నామనే ఫీలింగ్ మాత్రం అందరిలోనూ కలిగింది.
 
గీత రచయిత చంద్రబోస్ ఈ చిత్రానికి సాహిత్యం అందిస్తున్నారు. శివ ముప్పరాజు ఎడిటింగ్, స్క్రీన్ ప్లే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వెర్సటైల్ యాక్టర్ సాయికుమార్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
 
అద్భుతమైన సాంకేతిక బృందం, భారీ తారాగణంతో, మ్యూజికల్, ఎమోషనల్ జర్నీగా అందమైన ప్రేమ కథను త్వరలోనే ఆడియెన్స్ ముందుకు తీసుకు రాబోతోన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Modi: ఇంగ్లీష్ లోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్ మా వందే ప్రకటన