సీమరాజాతో సమంత పాట అదిరింది.. వామ్మో 2 మిలియన్ వ్యూస్

టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత కోలీవుడ్‌లోనూ టాప్ హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే. తన తొలి సినిమా హీరో నాగచైతన్యను పెళ్లి చేసుకొని అక్కినేని వారి కోడలయినా నటనను మాత్రం కొనసాగిస్తూనే హిట్ల మీద హిట్లు కొడుతో

Webdunia
శనివారం, 18 ఆగస్టు 2018 (11:42 IST)
టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత కోలీవుడ్‌లోనూ టాప్ హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే. తన తొలి సినిమా హీరో నాగచైతన్యను పెళ్లి చేసుకొని అక్కినేని వారి కోడలయినా నటనను మాత్రం కొనసాగిస్తూనే హిట్ల మీద హిట్లు కొడుతోంది. ప్రస్తుతం సెట్స్‌పై ఆమె సినిమాలు చాలానే ఉన్నాయి. ఇదిలాఉండగా సమంత త్వరలో ప్రేక్షకులు, అభిమానులకు డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. 
 
సమంత నటించిన రెండు సినిమాలు ఒకే రోజున విడుదలకానున్నాయి. అందులో ఒకటి తమిళ డబ్బింగ్ సినిమా ''సీమ రాజా'' కాగా రెండోది ''యు టర్న్''. ఈ రెండు సినిమాలు సెప్టెంబర్ 13న విడుదలవుతున్నాయి. పవన్‌కుమార్ దర్శకత్వంలో సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక చావ్లా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఇకపోతే.. శివకార్తికేయన్ హీరోగా రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్‌టైనర్ ''సీమరాజా''. ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అటు సస్పెన్స్ థ్రిల్లర్, ఇటు కామెడీ ఎంటర్‌టైనర్‌తో సమంత ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. 
 
ఇప్పటికే ఈ సినిమా నుంచి ఓ రొమాంటిక్ మెలోడీ సాంగ్ కోలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ''వున్న విట్టా'' అంటూ సాగుతున్న ఈ పాట 2 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. సమంత, శివ కార్తీకేయన్ జంటగా నటించే ఈ సినిమాలో సూరి, సిమ్రాన్, మనోబాల తదితరులు నటిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణలోని బైంసాలో వరుస గుండెపోటులతో ఇద్దరు మృతి

పవన్ కల్యాణ్ నా చిరకాల మిత్రుడు, నేను ఆయనను ఏమీ అనలేదు, అనను: విజయసాయి రెడ్డి

ఆంధ్ర, తెలంగాణల్లో హాట్ టాపిక్ అదే.. కేటీఆర్-జగన్, రేవంత్-చంద్రబాబుల భేటీ

అమరావతిలో 25 బ్యాంకులకు ఒకే రోజు శంకుస్థాపన

ఏలూరు జిల్లాలో పవన్ పర్యటన... సమస్యలను ఏకరవు పెట్టిన స్థానికులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments